యూపీ ఎన్నికల అధికారిపై ఈసీ చర్యలకు ఆదేశం

by Harish |
యూపీ ఎన్నికల అధికారిపై ఈసీ చర్యలకు ఆదేశం
X

లక్నో: యూపీలో ఏడోదశ పోలింగ్‌కు ముందు ఈవీఎం మిషిన్లను నిబంధలనలకు విరుద్ధంగా రవాణా చేసిన ఘటనలో ఎన్నికల అధికారి ఏడీఎం ఎన్‌కే సింగ్‌పై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించింది. బుధవారం ఈ మేరకు విడుదల చేసిన ఉత్తర్వులను యూపీ చీఫ్ ఎన్నికల ఆఫీసర్ అమలు చేయాలని ఆదేశాలు వచ్చినట్టు ఉత్తరప్రదేశ్ ఎన్నికల సంఘం ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. అయితే, ఎన్నికలకు ముందు ఈవీఎంల పనితీరుపై అధికారులు పోలింగ్ ఏజెంట్లకు అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తారు. ఈ క్రమంలోనే 'ఈవీఎంలను వారణాసి నియోజకవర్గంలో బరిలో నిలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులకు సమాచారం ఇవ్వకుండా తరలించడంపై సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తప్పుబట్టారు. గుట్టుచప్పుడు కాకుండా ఈవీఎం మిషిన్లను తరలిస్తున్న వాహనాన్ని తమ పార్టీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో యూపీలో బీజేపీ ప్రభుత్వం ఈవీఎంల టాంపరింగ్‌కు పాల్పడినదని ఎస్పీ చీఫ్ ఆరోపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed