Sonusood: టూరిజం బ్రాండ్‌ అంబాసిడర్‌గా సోనూసూద్‌.. గౌరవంగా భావిస్తున్నానంటూ ఎమోషనల్ ట్వీట్

by Hamsa |
Sonusood: టూరిజం బ్రాండ్‌ అంబాసిడర్‌గా సోనూసూద్‌.. గౌరవంగా భావిస్తున్నానంటూ ఎమోషనల్ ట్వీట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ నటుడు సోనూసూద్(Sonusood) పలు చిత్రాల్లో విలన్ పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించారు. గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన జనాల్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. మరీ ముఖ్యంగా కరోనా(Corona), లాక్‌డౌన్(Lockdown) సమయంలో వేలాది మందికి అండగా నిలిచారు. ఆపదలో ఉన్నవారికి తన వంతు సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు. ఇటీవల వరద బాధితులకు కూడా ఆయన సాయం చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా, సోనూసూద్‌(Sonusood)కు అరుదైన గౌరవం దక్కింది.

థాయ్‌ల్యాండ్ గవర్న‌మెంట్ అరుదైన పోస్ట్‌తో ఆయనను గౌరవించింది. సోనూసూద్‌ను టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌(Tourism Brand Ambassador)గా నియమించడంతో పాటు టూరిజం అడ్వైజర్‌గాను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ సోనూసూద్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘‘థాయ్‌లాండ్(Thailand) పర్యాటక శాఖకు బ్రాండ్ అంబాసిడర్, సలహాదారుగా నియమించబడినందుకు గౌరవంగా భావిస్తున్నాను. నా కుటుంబంతో కలిసి ఈ అందమైన దేశానికి నా మొదటి అంతర్జాతీయ పర్యటన చేశాను.

ఈ దేశంలోని అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, గొప్ప సాంస్కృతిక వారసత్వం గురించి సలహా ఇవ్వడానికి, ప్రోత్సహించడానికి నేను సంతోషిస్తున్నాను. అందరి ప్రేమకు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు’’ అని రాసుకొచ్చారు. ప్రజెంట్ సోనూసూద్ పోస్ట్ వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు, అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు.

Advertisement

Next Story