- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
YouTube వీడియో షేరింగ్ కోసం Snapchat కొత్త ఫీచర్..
by Harish |

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సోషల్ నెట్‌వర్క్ Snapchat వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ను తెచ్చింది. iOS, Android డివైజ్‌లలో ఇక సులభంగా YouTube వీడియోలను నేరుగా ప్లాట్‌ఫారమ్‌కు షేర్ చేసుకోవడం కోసం సరికొత్త ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. "ఈ కొత్త ఇంటిగ్రేషన్‌తో, వినియోగదారులు Snapchatలో తమ స్నేహితులతో మాట్లాడుతున్న చోటే ఇష్టమైన క్లిప్‌లు, వీడియోలను పంపడానికి సులభతర ఆప్షన్‌ను తెచ్చినట్లు" కంపెనీ తెలిపింది. "ఇకపై లింక్ కాపీ చేయాల్సన అవసరం లేకుండా డైరెక్ట్‌గా YouTube యాప్ నుండి వీడియోలను షేర్ చేసుకొవచ్చని" కంపెనీ బ్లాగ్‌పోస్ట్‌లో పేర్కొంది. వినియోగదారులు YouTube యాప్‌లో తమకు నచ్చిన క్లిప్ లేదా వీడియోలను ఇతరులకు షేర్ చేయడానికి వీడియో క్రింద షేరింగ్‌పై క్లిక్ చేసి Snapchat ఎంచుకోవడం ద్వారా సులభంగా వీడియో షేరింగ్ చేయవచ్చు.
Next Story