- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Skipping for Height: స్కిప్పింగ్ చేస్తే నిజంగానే పొడవు పెరుగుతారా? ఇందులో వాస్తవమెంత?

దిశ, వెబ్‌డెస్క్: చాలా మంది ప్రస్తుత రోజుల్లో వెయిట్ లాస్(Weight loss) అయ్యేందుకు, హైట్ పెరిగేందుకు స్కిప్పింగ్(skipping) ఆడుతుంటారు. అయితే ఓ వయసు దాటాక హైట్ పెరగడం చాలా కష్టం. 18 ఏళ్ల వరకే పొడవు పెరుగుతారు. దీంతో అనేక మంది స్కిప్పింగ్ ఆడితే హైట్ పెరుగుతామనే భావనతో స్కిప్పింగ్ ఆడుతుంటారు. మరీ ఇందులో నిజమేంతో నిపుణులు చెప్పిన తీరును ఓసారి చూద్దాం..
స్కిప్పింగ్ ఆడితే బాడీ ఫిట్(Body fit)గా ఉంటుంది. కండరాలు(muscles), బోన్స్ స్ట్రాంగ్(Bones strong)గా మారతాయి. కానీ పొడవు పెరగడం అనేది మాత్రం ఉండదని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు స్కిప్పింగ్ చేస్తే పొడవు పెరిగేందుకు అవకాశాలున్నాయి. అలాగే వారు తీసుకునే పోషకాలపై ఆధారపడి ఉంటుంది. స్కిప్పింగ్ వల్ల శరీరానికి బోలెడు ప్రయోజనాలున్నాయని అంటున్నారు.
స్కిప్పింగ్ వల్ల శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు(Health benefits) చూసినట్లైతే.. కాళ్లు, తొడ కండరాలు పటిష్టమవుతాయి. స్కిప్పింగ్ మంచి వ్యాయామం(exercise)గా అనుకోవచ్చు. చేతుల ఫ్లెక్సిబులిటీ(Flexibility of hands) కూడా పెరుగుతుంది. బాడీలో కాలరీస్ బర్న్(Burn calories) అయ్యేందుకు ఉపయోగపడుతుంది. దీంతో ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. ఊపిరితిత్తుల పనితీరు(Lung function) మెరుగుపడుతుంది. రక్తప్రసరణ(blood circulation) సాఫీగా జరుగుతుంది. గుండె ఆరోగ్యం(heart health)గా ఉంటుంది. స్కిప్పింగ్ చేస్తే మానసిక ఒత్తిడి(mental stress) కూడా తగ్గడానికి మేలు చేస్తుంది.