- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Halal Food: 'హలాల్' మాంసం వివాదంపై లక్కీ అలీ.., 'దాని అర్థం ఇదే'!
దిశ, వెబ్‌డెస్క్ః వివాదం లేపడానికి కారణం ఏదైనా ఫర్వాలేదు అన్నట్లుంది సమాజం పరిస్థితి. ముఖ్యంగా ఇండియాలో ఈ తరహా పరిణామం మరింత ఎక్కువవుతోంది. తరతరాలుగు ఎవరి సంస్కృతిని వాళ్లు పాటిస్తూ ఒకే నేలపై బతుకున్నవారి మధ్య హలాల్ పేరుతో కలహాలు సృష్టించడానికి మరో వాదన ఇటీవల బయటకొచ్చింది. 'హలాల్' మాంసాన్ని బహిష్కరించాలని, బ్రాండెడ్ కంపెనీలు హలాల్ చేయబడిన మాంసం అనే మాటను తీసేయాలని కొన్ని సమూహాలు వాదన మొదలెట్టాయి. ప్రస్తుతం చర్చనీయాంశమైన ఈ అంశంపై తాజాగా ప్రముఖ గాయకుడు లక్కీ అలీ తన అభిమానులు, అనుచరులకు హలాల్ అంటే అర్ధాన్ని వివరించడానికి సామాజిక మాధ్యమాన్ని వినియోగించుకున్నారు.
బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి సిటి రవి 'హలాల్'ను "ఆర్థిక జిహాద్"తో పోల్చిన కొద్ది రోజుల తర్వాత అలీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పాపులర్ పాటలు 'ఓ సనమ్', 'ఏక్ పాల్ కా జీనా' వంటి పాటలు పాడిన గాయకుడు-గేయరచయిత లక్కీ అలీ 'హలాల్' అనే భావన ఇస్లామిక్ విశ్వాసాన్ని పాటించే వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుందని అన్నారు. "హలాల్' ఖచ్చితంగా ఇస్లామేతరులకు కాదు. హలాల్‌ను యూదుల కోషెర్‌తో సమానమని అర్థం చేసుకున్న ముస్లిమ్‌లు ఒక ఉత్పత్తిలోని పదార్థాలు వారి సంస్కృతిని బట్టి వినియోగించదగిన పరిమితుల ప్రకారం ఉన్నాయని ధృవీకరించుకోనంత వరకు ఆ ఉత్పత్తిని కొనుగోలు చేయరు." 'హలాల్' అనేది అరబిక్ పదం. ఇది ఇంగ్లీష్‌లో "అనుమతించదగినది" అని. అందుకే, "ముస్లిం, యూదు జనాభా" ఉత్పత్తులను విక్రయించాలంటే, కంపెనీలు ఆ వస్తువును 'హలాల్' సర్టిఫికేట్ లేదా 'కోషర్' సర్టిఫికేట్ అని లేబుల్ చేయాలి. "... లేకపోతే ముస్లింలు, యూదులు వారి నుండి కొనుగోలు చేయరు.." అది వారి సంస్కృతిలో భాగం అని, ఈ పదం తీసేస్తే అది వ్యాపారంపై ప్రభావం చూపుతుందని అన్నాడు.
ఇక, మార్చి 31న కర్ణాటక హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర మాట్లాడుతూ 'హలాల్' సమస్యపై ప్రభుత్వానికి పరిమిత పాత్ర మాత్రమే ఉందని, ఇది ప్రజల విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నాడు. 'హలాల్ ఆహారాన్ని బహిష్కరించు' అనే ప్రచారం శాంతిభద్రతల పరిస్థితి కాదని, విశ్వాసం, మనోభావాలకు సంబంధించినదని, ఇది "అందరికీ తెలుసు" అని జ్ఞానేంద్ర అన్నాడు. అయితే, ఉగాది మరుసటి రోజు రాష్ట్రంలోని అనేక సంఘాలు మాంసాహార విందు జరుపుకునే 'వర్షదోడ' పండుగకు ముందు కొన్ని మితవాద సంఘాలు 'హలాల్ మాంసాన్ని' బహిష్కరించాలని పిలుపునిచ్చాయి. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో హిందూ మతపరమైన ఉత్సవాల సమయంలో దేవాలయాల చుట్టూ ముస్లిం విక్రేతలపై నిషేధం నేపథ్యంలో ఈ పిలుపు వచ్చింది.