- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సూటిగా చెప్పలేకుంటే.. నాటీగా చెప్పొచ్చు : శ్రుతి హాసన్

దిశ, సినిమా : స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్త్రీలు, ఆడపిల్లలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. సమాజంలో అతివల ఎదుగుదల, ఆలోచనా విధానం గురించి మాట్లాడింది. 'నేటి తరం స్ర్తీ-పురుష బేధము లేకుండా ముందుకెళ్లడం సంతోషంగా ఉంది. కానీ ఇప్పటికీ స్త్రీలు తమ అభిప్రాయాలు, బలహీనతలను ధైర్యంగా వెల్లడించేందుకు భయపడుతున్నారు.
అయితే ఇలాంటి విషయాలను సూటిగా చెప్పలేనప్పుడు సరదాగా నవ్వుతూనే బయటపెట్టాలి. మరోవైపు దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న కొన్ని సంఘటనలు చూస్తే.. సమాజం ఇంకా మేల్కోవాల్సి ఉందనిపిస్తోంది. ముఖ్యంగా మహిళలు మరింత శక్తివంతంగా, ధైర్యంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను' అని చెప్పుకొచ్చింది. ఇక తన బలహీనతలను సంగీతం లేదా రచనల ద్వారా చూపిస్తానన్న నటి.. ఈ విషయాన్ని గుర్తించడానికి తనకు 30 ఏళ్లు పట్టిందని చెప్పడం విశేషం.