- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సెట్‌లో గొడవ జరిగింది నిజమే.. ఆవేశంలో బూతులు తిట్టానంటూ..
by Manoj |

X
దిశ, సినిమా : అత్యంత ప్రజాదరణ పొందిన టెలివిజన్ నటీమణుల్లో శివంగి జోషి ఒకరు. ప్రస్తుతం 'ఖత్రోన్ కే ఖిలాడీ 12'లో సత్తాచాటుతున్న భామ.. టాస్క్‌లో భాగంగా సహనటుడు మొహ్సిన్ ఖాన్‌తో గొడవ పెట్టుకుందని, మనస్తాపంతో షో నుంచి నిష్క్రమించిందని నెట్టింట రూమర్స్ క్రియేట్ అయ్యాయి. అయితే ఈ వార్తతో తన అభిమానులు ఆందోళన చెందుతున్నట్లు గమనించిన శివంగి తాజాగా ఈ ఇష్యూపై రియాక్ట్ అయింది. 'ఖత్రోన్ కే ఖిలాడీలో నిరంతరం పోరాటాలే ఉంటాయి. సెట్‌లో చాలా గొడవలు జరుగుతాయి. ఒక నటుడితో నాకు గొడవ అయింది నిజమే. నేనే ఆవేశంలో మాటజారాను. అయితే షో నుంచి వెళ్లిపోయాననేది పూర్తిగా అబద్దం. నేను ఎప్పటికీ నిష్క్రమించను' అంటూ చెప్పుకొచ్చింది.
Next Story