ఏఐఎంఐఎం పార్టీతో పొత్తు లేదు: శివసేన ఎంపీ సంజయ్ రౌత్

by Vinod kumar |
ఏఐఎంఐఎం పార్టీతో పొత్తు లేదు: శివసేన ఎంపీ సంజయ్ రౌత్
X

ముంబై: శివసేన నేత సంజయ్ రౌత్ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అంతేకాకుండా అది బీజేపీ బీ టీమ్ అని వర్ణించారు. ఆదివారం రౌత్ మీడియాతో మాట్లాడారు. 'సీఎం ఉద్ధవ్ థాక్రే తాజా సమావేశంలో తమ పార్టీ ఎంపీలు, జిల్లా అధ్యక్షులతో ఏఐఎంఐఎంతో ఎలాంటి పొత్తు లేదని చెప్పారు.


బీజేపీకి బీ-టీం అని అన్నారు' అని తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్, సంభాజీ మహారాజ్ విలువలపై తమ పార్టీ నిర్మితమైందని, వాటినే కొనసాగిస్తున్నామని చెప్పారు. ఔరంగజేబు సమాధి వద్ద తామెప్పుడు మోకరిల్లమని తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం మూడు పార్టీల కలయికేనని, నాలుగో పార్టీ అవకాశమివ్వమని చెప్పారు. బీజేపీ విజయం వెనుక ఏఐఎంఐఎం పార్టీ బాధ్యత ఉందని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed