- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రావిర్యాల రైతులకు పరిహారం అందిస్తాం: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : ఫ్యాబ్ సిటీ నిర్మాణంలో భూములను కోల్పోయి పరిహారం అందని రావిర్యాల రైతులకు త్వరలోనే పరిహారం అందిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని తన కార్యాలయంలో రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ అధికారులు, బాధితులతో ఆమె బుధవారం సమావేశం నిర్వహించారు. ఫ్యాబ్ సిటీ నిర్మాణంలో భూములు కోల్పోయిన రావిర్యాల గ్రామ రైతులకు పరిహారాన్ని అందించే విషయంలో తీవ్ర జాప్యం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. పరిహారం అందక రైతు కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని సీఎం కేసీఆర్దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. పారిశ్రామిక ప్రాంతాలను ఏర్పాటు చేసేందుకు భూములు త్యాగం చేసిన రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందులను కలిగించొద్దని సూచించారు.
మధ్యాహ్న భోజన కార్మికులకు గౌరవ వేతనం పెంపు పై హర్షం
మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనాన్ని రూ.1000 నుంచి రూ.3 వేలకు పెంచుతూ సీఎం కేసీఆర్నిర్ణయంపై కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయానికి వచ్చిన వారు ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. 54,201 మంది మధ్యాహ్న భోజన కార్మికులకు లబ్ధి చేకూరేలా తీసుకున్న నిర్ణయంపై సంబరాలు జరుపుకున్నామని వారు మంత్రికి వివరించారు. కాగా ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని, విద్యార్థులకు అన్ని జాగ్రత్తలు తీసుకొని, పరిశుభ్ర వాతావరణంలో భోజనం వండాలని మంత్రి వారికి సూచించారు.