- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కృష్ణా జలాల పంపిణీ పై కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండి: బండి సంజయ్
దిశ, తెలంగాణ బ్యూరో : కృష్ణా నదీ జలాల కేటాయింపు లో భాగంగా తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు పరిష్కరించడం తో పాటు తెలంగాణకు న్యాయం చేసేందుకు తక్షణమే కొత్త ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కోరారు. పార్లమెంట్ హౌస్ లోని జలవనరుల శాఖ మంత్రి కార్యాలయానికి బుధవారం వెళ్లిన బండి సంజయ్ బుధవారం కేంద్ర మంత్రిని కలిసి కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై చర్చించారు. ప్రస్తుతం ఉన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వల్ల నీటి కేటాయింపుల విషయంలో తెలంగాణకు న్యాయం జరిగే అవకాశం లేదన్నారు.
కొత్త ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేస్తేనే తెలంగాణ-ఏపీ రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్య పరిష్కారమవుతుందని, తెలంగాణకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. కాగా దీనిపై కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, పార్టీ తమిళనాడు రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి, పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాలసుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డి ఉన్నారు.