- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో యుద్ధ భయాలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే, కనిష్టాల వద్ద ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో తిరిగి లాభాలను సాధించాయి. మంగళవారం ట్రేడింగ్‌లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ముడి చమురు ధరల రికార్డు పెరుగుదల వంటి పరిణామాలతో సూచీలు ఉదయమంతా నష్టాల్లో కదలాడిన తర్వాత మిడ్-సెషన్ నుంచి లాభాల్లోకి మారాయి. తీవ్ర ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కనిష్టాల వద్ద కొనుగోళ్లకు అవకాశం ఉండటంతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో ర్యాలీ అయ్యాయి. ముఖ్యంగా ఐటీ, ఫార్మా రంగాల్లో బలమైన కొనుగోళ్లతో మదుపర్లు మద్దతివ్వడం తో వరుస నష్టాలకు బ్రేక్ పడింది.
దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 581.34 పాయింట్లు ఎగసి 53,424 వద్ద, నిఫ్టీ 150.30 పాయింట్లు పెరిగి 16,013 వద్ద ముగిశాయి. నిఫ్టీ లో ఐటీ 2.69 శాతం, ఫార్మా 2.38 శాతం పుంజుకోవడంతో స్టాక్ మార్కెట్లకు కలిసొచ్చింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో సన్‌ఫార్మా, టీసీఎస్, ఎన్‌టీపీసీ, విప్రో, టెక్ మహీంద్రా, డా రెడ్డీస్, ఆల్ట్రా సిమెంట్, ఇన్ఫోసిస్ షేర్లు అధిక లాభాల్లో ర్యాలీ చేయగా, టాటా స్టీల్, పవర్‌గ్రిడ్, టైటాన్, నెస్లె ఇండియా, రిలయన్స్, ఎస్‌బీఐ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 76.99 వద్ద ఉంది.