- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇమ్యూన్ సిస్టమ్ ఫుల్ మ్యాప్ రూపొందించిన శాస్త్రవేత్తలు
దిశ, ఫీచర్స్ : వ్యక్తిగత కణాల మధ్య జరిగే సమాచార మార్పిడికి శాస్త్రవేత్తలు అధునాతన స్క్రీనింగ్ పద్ధతులు ఉపయోగించారు. తద్వారా మనిషి రోగనిరోధక వ్యవస్థకు సంబంధించి 'పూర్తి కనెక్టివిటీ మ్యాప్'ను మొదటిసారిగా రూపొందించారు. ఈ కొత్త రేఖాచిత్రం క్యాన్సర్ తదితర వ్యాధుల పురోగతిని క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకు పరిశోధకులకు సాయపడనుండగా.. ఇది శరీర రక్షణను బలోపేతం చేసే భవిష్యత్ చికిత్సల కోసం ఉపయోగపడనుంది.
సాధారణంగా రోగనిరోధక కణాల మధ్య ఒక సిగ్నలింగ్ వ్యవస్థ ఉంటుందని తెలిసిందే. మనం గాయపడినపుడు లేదా జబ్బుపడినపుడు వెంటనే ఇమ్యూన్ సెల్స్ ప్రతిస్పందించి ఆ ఉపద్రవం నుంచి శరీరాన్ని కాపాడేందుకు ఇతర రోగనిరోధక కణాలకు సందేశాలు పంపుతాయి. ఈ కమ్యూనికేషన్ మొత్తం రోగనిరోధక కణాల ఉపరితలం పైనుండే ప్రోటీన్ల ద్వారా జరుగుతుంది. ఇవి ఇతర కణాల ఉపరితలాలపై ఉన్న గ్రాహక ప్రోటీన్లతో జట్టు కడతాయి. అయితే ఈ కనెక్షన్లలో కొన్నింటి గురించి సైంటిస్టులకు ఇప్పటికే తెలిసి ఉండగా.. శరీరమంతటా ఇందుకు సంబంధించిన సమగ్ర రేఖాచిత్రాన్ని రూపొందించేందుకు వెల్కమ్ సాంగర్ ఇన్‌స్టిట్యూట్, ETH జ్యూరిచ్ పరిశోధకులు కృషి చేస్తున్నారు.
రోగనిరోధక కణాలు శరీరం అంతటా ఎలా కనెక్ట్ అవుతాయి? ఎలా కమ్యూనికేట్ చేస్తాయి? వంటి విశేషాలు సహా గతంలో తెలియని పరస్పర చర్యలను 'కనెక్టివిటీ మ్యాప్'లో పొందుపరిచారు. ఇది శరీరం రోగనిరోధక రక్షణను నిర్వహించే విధానంపై విలువైన కొత్త అంతర్దృష్టులను అందిస్తుంది. అంతేకాదు మాదకద్రవ్యాల వాడక సమయంలో ఏ ప్రోటీన్లు ప్రయోజనకరంగా ఉంటాయో హైలైట్ చేయడంలో ఈ పరిశోధన ఒక అద్భుతమైన కొత్త సాధనాన్ని రూపొందించింది. ఇంకా ఈ మ్యాప్ ఆటో ఇమ్యూన్ వ్యాధుల నివారణ, చికిత్స కోసం బ్లూప్రింట్‌ను అందించగలదు.
ప్రతీ రోగనిరోధక కణాన్ని, ఇతరులతో వాటి పరస్పర చర్యలను సూక్ష్మంగా వేరుచేయడం సహా విశ్లేషించడం వల్ల మానవ శరీరంలోని అన్ని రోగనిరోధక కణాల మధ్య సంభాషణలు గల మొదటి మ్యాప్ మాకు అందింది. ఇది రోగనిరోధక వ్యవస్థ అంతర్గత పనితీరును అర్థం చేసుకోవడంలో కీలక అడుగు. శరీర రక్షణ విధానాలతో పనిచేసే కొత్త చికిత్సలను అభివృద్ధి చేసేందుకు ప్రపంచవ్యాప్త పరిశోధకులు దీన్ని ఉపయోగించుకుంటారు.
- జారోడ్ షిల్ట్స్ , సైంటిస్ట్ వెల్‌కమ్ సాంగర్ ఇన్‌స్టిట్యూట్