SBI వినియోగదారులకు అలర్ట్.. కొత్త గైడ్‌లైన్స్ ఇదే!

by Harish |   ( Updated:2022-04-25 11:12:45.0  )
SBI వినియోగదారులకు అలర్ట్.. కొత్త గైడ్‌లైన్స్ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: క్రెడిట్/డెబిట్ కార్డ్, ఏటీఎం, యూపీఐ మోసాలు రాను రాను మరి ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో డిజిటల్ లావాదేవీలు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయి. బ్యాంకింగ్ సిస్టం మొత్తం డిజిటల్‌గానే నడుస్తుంది. వీటిలో ఉండే లోసుగులను ఆసరాగా చేసుకొని ఆన్‌లైన్ లావాదేవీలలో కూడా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దేశంలో వీటికి సంబంధించిన కేసులు వందల సంఖ్యలో నమోదవుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ మోసాలపై జాగ్రత్త వహించాలని ప్రజలకు హెచ్చరికలు కూడా జారీచేసింది. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా తమ కస్టమర్లకు కొత్తగా గైడ్‌లైన్స్ విడుదల చేసింది. ఆన్‌లైన్ బ్యాంకింగ్, యూపీఐ పేమెంట్స్ మొదలగు లావాదేవీలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించింది.

SBI గైడ్‌లైన్స్..

మొబైల్ బ్యాంకింగ్: బ్యాంక్‌కు వెళ్ళకుండానే ఆన్‌లైన్ ద్వారా లావాదేవీలను పూర్తి చేయడానికి మొబైల్ బ్యాంకింగ్ చాలా ముఖ్యం. స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్ మొదలగు వాటిలో లాగిన్ అయ్యే పాస్‌వర్డ్‌ను క్లిష్లమైనది, గుర్తుండేది పెట్టుకొవాలి. కష్టతరమైన పాస్‌వర్డ్స్ సెట్ చేయడం ద్వారా హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉండదు. అలాగే లాగిన్ వివరాలు కూడా ఎవరికీ షేర్ చేయవద్దు. మొబైల్ యాప్స్‌లో వాడాలనుకుంటే, అనధికార యాప్స్ ఇన్‌స్టాల్ చేయొద్దు. అధికారిక యాప్స్ మాత్రమే డౌన్‌లోడ్ చేసుకొని వాటిని మాత్రమే ఉపయోగించాలి. ఒకవేళ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఉంటే దాన్ని వాడటం ఉత్తమం

పాస్‌వర్డ్ షేరింగ్: ఆన్‌లైన్ బ్యాంకింగ్‌లో ముఖ్యమైనది లాగిన్ ఐడి వివరాలు. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, పిన్ ఎక్కడా రాసిపెట్టుకోకూడదు. వీటిని తరుచు మారుస్తూ ఉండాలి. కనీసం నెల రోజులకు అయిన లేదా, 3-4 నెలలకు ఒకసారి అయిన లాగిన్ వివరాలు మారుస్తూ ఉండాలి. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేసినప్పుడు ఆటో సేవ్ డిటెయిల్స్‌ను వాడకూడదు.

UPI : యూపీఐ ట్రాన్సాక్షన్స్ విషయంలో యూపీఐ పిన్, మొబైల్ పిన్‌ను ఒకే విధంగా సెట్ చేస్తుంటారు. ఇలా చేయకుండా రెండు పిన్‌లు ఒకదానితో ఇంకొటి సంబంధం లేకుండా పెట్టుకొవాలి. అనవసర యూపీఐ రిక్వెస్ట్‌లు వస్తే వాటిని యాక్సెప్ట్ చేయకుడదు.

ఇంటర్ నెట్: నెట్ బ్యాంకింగ్ వాడేటప్పుడు వెబ్‌సైట్‌లో https అని ఉంటే వాటిని మాత్రమే వాడాలి. అధికారిక/ సెక్యూర్డ్ వెబ్‌సైట్స్‌ https ని కలిగి ఉంటాయి. ఈ ఫార్మాట్‌ను గూగుల్/అధికారిక సంస్థలు వెరిఫికేషన్ చేసి సేఫ్టి వెబ్‌సైట్స్‌గా గుర్తిస్తాయి. బయట ప్రదేశాలలో ఓపెన్ వైఫై నెట్‌వర్క్స్‌ను ఎప్పుడు వాడకూడదు.

క్రెడిట్/డెబిట్ కార్డ్: లావాదేవీల కోసం ఏటీఎం కార్డును ఉపయోగించినప్పుడు ఇతరులకు కనిపించకుండా జాగ్రత్తగా, కీప్యాడ్ కవర్ చేసి పిన్ ఎంటర్ చేయాలి. ఏటీఎం కార్డు, డెబిట్ కార్డుకు ట్రాన్సాక్షన్ లిమిట్ సెట్ చేసుకోవడం ఉత్తమం.


Post Office Savings Schemes :పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లో ఈ కొత్త రూల్ తెలుసా?

Advertisement

Next Story