భట్టితో జగ్గారెడ్డి భేటీ.. రాజీనామా అంశంపై చర్చ!

by Web Desk |
భట్టితో జగ్గారెడ్డి భేటీ.. రాజీనామా అంశంపై చర్చ!
X

దిశ ప్రతినిధి, సంగారెడ్డి: సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి భేటీ అయ్యారు. మల్లు తో పాటు కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఉన్నారు. మధ్యాహ్నం భట్టి విక్రమార్క జగ్గారెడ్డి కి ఫోన్ చేసి సీఎల్పీ కార్యాలయానికి రావాలని పిలిచారు. దీంతో జగ్గారెడ్డి అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా భట్టి, శ్రీధర్ బాబు, రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి మధ్య చర్చలు జరిగాయి. తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు జగ్గారెడ్డి ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, యువనేత రాహుల్ గాంధీ తో భేటీ అవుతానని అందుకు కాంగ్రెస్ నేతలు సహకరించాలని కోరిన విషయం కూడా తెలిసిందే.

అందుకు పదిహేను రోజుల సమయం ఇచ్చారు. ఆలోగా రాహుల్ ను కలిసి తన బాధలు, ఇబ్బందులు చెప్పుకుంటే ఉంటా లేదంటే పార్టీ నుంచి వెళ్ళిపోతాను స్పష్టం చేసిన విషయం విదితమే. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇప్పుడు భట్టి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి, జగ్గారెడ్డి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. రాజీనామా అంశాన్ని పక్కన పెట్టాలని, ఏవైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందామని జగ్గారెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

Advertisement

Next Story