Samantha: పదేపదే ఫోన్ కాల్.. సమంత నెంబర్ బ్లాక్ చేసి పడేసిన నాగ చైతన్య.. దుమారం రేపుతున్న న్యూస్..?

by Kavitha |   ( Updated:2024-11-09 07:09:35.0  )
Samantha: పదేపదే ఫోన్ కాల్.. సమంత నెంబర్ బ్లాక్ చేసి పడేసిన నాగ చైతన్య.. దుమారం రేపుతున్న న్యూస్..?
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ‘ఏమాయ చేసావే’(Ye maya chesave) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఈ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)తో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ, మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు. విడాకుల తర్వాత నాగచైతన్య రీసెంట్‌గా స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobhitha dulipala)తో ఎంగేజ్‌మెంట్ చేసుకొని రెండో పెళ్లికి రెడీ అయ్యాడు. సమంత మాత్రం విడాకుల తర్వాత మయోసైటీస్(Myositis) అనే వ్యాధి బారిన పడడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. హెల్త్ పై ఫోకస్ పెట్టింది. కాగా ప్రస్తుతం ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny) అనే వెబ్ సిరీస్‌తో మన ముందుకు వచ్చింది. నవంబర్ 7నుంచి అమెజాన్ ప్రైమ్‌(Amazon prime)లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ మిక్సడ్ టాక్‌తో దూసుకుపోతోంది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సమంత, నాగచైతన్యకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. హీరోయిన్ సమంత - నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే చాలాకాలం వీళ్ళు గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం కొనసాగించారు. ఇక సామ్- చై ప్రేమించుకునే టైంలో చాలా సరదా సరదాగా గొడవలు చేసుకునేవారట. అఫ్ కోర్స్ అందరూ లవర్స్ అలానే గొడవలు పడుతూ ఉంటారు అనుకోండి. అయితే ఒకానొక మూమెంట్లో సమంత.. నాగ చైతన్య షూటింగ్ టైంలో ఉన్నప్పుడు పదే పదే కాల్ చేసి విసిగిస్తూ ఉండడంతో ఆమె నెంబర్ బ్లాక్(Number Block) చేసేశాడట. దీంతో ఫుల్ కోపం వచ్చిన సామ్ ఏకంగా చైతన్య షూటింగ్ స్పాట్‌కే వెళ్లిందట. అక్కడ కారులో కూర్చుని మరి ఆయనను షూటింగ్ నుంచి బయటకు రప్పించిందట. ఇక సమంత ఫేస్ చూడగానే చై కూల్ అయిపోయి సారీ కూడా చెప్పాడట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Advertisement

Next Story

Most Viewed