Samantha: ‘సరిహద్దులు దాటి నటించే సమయమొచ్చింది.. తనే నా రోల్ మోడల్’.. సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Anjali |   ( Updated:2024-11-11 14:25:34.0  )
Samantha: ‘సరిహద్దులు దాటి నటించే సమయమొచ్చింది.. తనే నా రోల్ మోడల్’.. సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సరిహద్దులు దాటి నటించే టైం వచ్చిందంటోంది టాలీవుడ్ ముద్దుగుమ్మ సమంత(Samantha). ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి.. అద్బుతమైన నటిగా ప్రేక్షకుల్లో ఓ ముద్ర వేసుకుంది. ఇప్పటి వరకు సామ్ నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లనే చెప్పుకోవచ్చు. రీసెంట్‌గా ఈ అమ్మడు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్(Varun Dhawan) తో కలిసి సిటాడెల్: హన్నీ బన్నీ(Citadel: Hunny Bunny) అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్‌తో సమంతలోని మరో కోణాన్ని బయటపెట్టి జనాల్ని ఆశ్చర్యపరిచింది.

ఇకపోతే ఈ బ్యూటీ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. టాలీవుడ్ స్టార్ దర్శకుడు రాజమౌళి(Rajamouli) తన పాన్ ఇండియా సినిమాలతో గేట్లు తెరిచారని.. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో టాలీవుడ్, దక్షిణాది, ఉత్తరాది అని తేడాలేం లేవని తెలిపింది. అయితే దక్షిణాదిలో పాన్ ఇండియా స్థాయిలో ఎదగడానికి టైం ఎందుకు ఇంత ఎక్కువగా పట్టిందని ఎంతో మంది అడిగారని తెలిపింది. ఇందుకు కారణం.. ప్రొడ్యూసర్లు మార్కెటింగ్ పరంగా బలంగా లేకపోవడమేనని అన్నారు. అలాగే పాన్ ఇండియా సినిమాలు వచ్చినప్పటి నుంచి నటీనటులకు సరిహద్దులు దాటి చాన్స్ లు వస్తున్నాయని చెప్పింది.

చాలా మంది నటులు హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి... అవకాశాలు దక్కించుకుంటున్నారని తెలిపింది. ఈ విషయంపై చాలా సార్లు ఎంతో మంది తనను అడిగారని వెల్లడించింది. ఇప్పుడు సరిహద్దులు దాటి నటించే సమయం వచ్చిందని తెలిపింది. హాలీవుడ్‌లో కూడా తన సత్తా చాటుతోన్న ప్రియాంక చోప్రా() సామ్ కు రోల్ మోడల్ అని చెప్పుకొచ్చింది. మహిళలకు ప్రియాంక ఆలోచించడం నేర్పుతుందని వెల్లడించింది. అంతేకాకుండా తన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకమని.. ఆమె ఓ పవర్ హౌస్ అని సమంత ఇంటర్వ్యూలో తెలిపింది.


Read More ...

Samantha: చైతన్య- శోభిత ఒక్కటి కాబోతున్న వేళ.. ఆ ఇద్దరి వల్ల ఎంత ఏడ్చానో అంటూ సమంత సంచలన కామెంట్స్

Advertisement

Next Story

Most Viewed