- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారిని అగౌరవ పరిచేలా Sai Pallavi సంచలన కామెంట్స్.. తీవ్రంగా మండిపడుతున్న నెటిజన్లు..
దిశ, సినిమా: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ప్రేమమ్’(Premam) సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. సినిమాల్లో మినిమల్ మేకప్, బోల్డ్ సీన్స్‌లో యాక్ట్ చేయను అనే రూల్స్ పెట్టుకోవడంతో ఈ అమ్మడుపై అభిమానం మరింత పెరిగిపోయింది. ఇక ఈ ముద్దుగుమ్మ డాక్స్‌కు అయితే ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. అయితే ఇప్పటి వరకు ఏ వివాదాల్లో తలదూర్చని సాయి పల్లవి.. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. మరి ఆమె చేసిన ఆ వివాదాస్పద కామెంట్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Karthikeyan) హీరోగా, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అమరన్’(Amaran). బయోగ్రాఫికల్ యాక్షన్ ఫిల్మ్‌గా రాజ్ కుమార్ పెరియసామి(Raj Kumar Periyasamy) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ల జోరులో ఉన్నారు చిత్ర బృదం.
ఇదిలా ఉంటే.. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి.. ఇండియన్ ఆర్మీని అగౌరవపరిచేలా ఈమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతోంది. గతంలో ఆమె మాట్లాడుతూ.. "సమస్య పరిష్కారానికి హింస కరెక్ట్ కాదు. ఒకప్పుడు చట్టం లేకపోవడంతో యుద్ధాలు చేశారు. ఇప్పుడు ఆ అవసరం లేదు. పాక్ వాళ్ళు ఇండియన్ ఆర్మీని, ఇండియన్ వాళ్లు పాక్ ఆర్మీని టెర్రరిస్టులుగా భావిస్తారు" అని ఆమె అన్నారు. అప్పట్లో ఈ భామ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ మారాయి. అయితే సాయిపల్లవి చేసిన కామెంట్స్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇండియన్ ఆర్మీని అగౌరవపరిచేలా మట్లాడారంటూ తీవ్రంగా మండిపడుతున్నారు. అసలు ఇండియన్ ఆర్మీ అధికారి కథతో తెరకెక్కిన మూవీలో నటించే అర్హత ఈమెకు లేదు అంటూ తిట్టిపోస్తున్నారు. కాగా ‘అమరన్’ మూవీలో ఈ బ్యూటీ ఆర్మీ అధికారి భార్యగా నటిస్తోంది.