8 ఏళ్ల తర్వాత ఆ స్టార్ హీరోతో సాయి పల్లవి రొమాన్స్..? ఎట్టకేలకు కనికరించిందిగా అని అంటున్న నెటిజన్లు

by Kavitha |   ( Updated:2024-11-04 03:57:19.0  )
8 ఏళ్ల తర్వాత ఆ స్టార్ హీరోతో సాయి పల్లవి రొమాన్స్..? ఎట్టకేలకు కనికరించిందిగా అని అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ప్రేమమ్’(Premam) మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. సినిమాల్లో మినిమల్ మేకప్, బోల్డ్ సీన్స్‌లో యాక్ట్ చేయను అనే రూల్స్ పెట్టుకోవడంతో ఈ అమ్మడుపై అభిమానం మరింత పెరిగిపోయింది. ఇక ఈ ముద్దుగుమ్మ డాన్స్‌(Dance)కు అయితే ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. ఇక కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Sivakarthikeyan) సరసన నటించిన ‘అమరన్’(Amaran) మూవీ దీపావళి సందర్భంగా రిలీజై హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో ఈ అమ్మడు యాక్టింగ్‌కి ఫుల్ మార్క్సే పడ్డాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ.. నాగ చైతన్య(Naga Chaitanya) సరసన ‘తండేల్’(Tandel) మూవీలో అలాగే ‘రామాయణం’(Ramayanam) సినిమాలో నటిస్తోంది. ఇలా వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న సాయి పల్లవి గురించి ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే..?

ఇప్పటి వరకు సాయి పల్లవి తెలుగు(Telugu), తమిళ్(Tamil), మలయాళ(Malayalam) హీరోల సరసన నటించిన సంగతి తెలిసిందే. అయితే మళ్ళీ ఎనిమిదేళ్ల తర్వాత ఓ మలయాళ హీరోతో మరోసారి రొమాన్స్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా ఆ హీరో ఎవరో కూడా కాదు మొన్న సాయి పల్లవి ‘అమరన్’ తో పోటీకి వచ్చిన ‘లక్కీ భాస్కర్’(Lucky Bhasker) హీరో దుల్కర్ సల్మాన్‌(Dulquer Salman)తో అట. మరి సాయి పల్లవి దుల్కర్‌తో ఎపుడో 2016 లో 'కాళీ'(Kaali) అనే సినిమాలో నటించింది. ఆ మూవీ తెలుగులో కూడా 2017 లో విడుదల అయ్యింది. కానీ తెలుగులో అంతగా ఆడలేదు. అయితే ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత దుల్కర్ సరసన నటించేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే దుల్కర్ చేయనున్న అప్ కమింగ్ సినిమాలో అయితే ఈమె తనతో రొమాన్స్ చేయనుందట. కాగా ఈ సినిమాపై మరిన్ని డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉన్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ మారగా.. ఎట్టకేలకు ఇన్నాళ్లకు కనికరించిందిగా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story