- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాయి పల్లవి నన్ను అలా పిలిచినందుకు చాలా ఫీలయ్యా.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ హీరోగా, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్‌గా తెరకెక్కిన తాజా చిత్రం ‘అమరన్’. బయోగ్రాఫికల్ యాక్షన్ ఫిల్మ్‌గా రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ మూవీలో శివకార్తికేయన్ ఆర్మీ అధికారి మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో కనిపించనున్నారు. కాగా సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మూవీ టీమ్ ప్రమోషన్లలో బిజీ బిజీగా ఉన్నారు. అందులో భాగంగా తాజాగా చెన్నై వేదికగా ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. అయితే ఈ ఈవెంట్‌లో పాల్గొన్న హీరో శివకార్తికేయన్ సాయిపల్లవి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. “నేను ఓ టీవీ చానల్‌కు వర్క్ చేస్తున్నప్పుడు సాయిపల్లవిని మొదటిసారి కలిశాను. నేను వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఓ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఇండస్ట్రీలో ఆమె పేరే ఒక బ్రాండ్. ప్రేమమ్ సినిమాలో ఆమె నటన చూసి ఆశ్చర్యపోయా. ఫోన్ చేసి ప్రశంసించా. ఆమె వెంటనే ‘థ్యాంక్యూ అన్నా’ అని చెప్పింది. నన్ను అన్నా అని పిలిచినందుకు అప్పుడు చాలా ఫీల్ అయ్యాను. కానీ ఆమె అప్పటికీ ఇప్పటికీ గొప్ప నటినే” అంటూ శివ కార్తికేయన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.