- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hyderabad News: సీతారాముల కల్యాణానికి RTC స్పెషల్ బస్సులు
దిశ,డైనమిక్ బ్యూరో :దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణలో భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ముస్తాబవుతోంది. గత రెండేళ్లుగా కరోనా వైరస్ కారణంగా భక్తులు లేకుండానే కల్యాణం నిర్వహించారు. అయితే, ప్రస్తుతం కరోనా అదుపులోకి రావడంతో స్వామివారి కల్యాణాన్ని లక్షలాది భక్తుల నడుమ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భద్రాద్రికి తరలిరానున్నారు. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. అందులో హైదరాబాద్ నుంచి భద్రాచలానికి 70 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఇవి ఎంజీబీఎస్‌తో పాటు ఎల్‌బీనగర్ ముఖ్య కూడళ్ల నుంచి అందుబాటుల్లో ఉండనున్నాయి. భద్రాచలం వెళ్లే ప్రయాణికులు రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు అని ఒకవేళ రద్దీ పెరిగితే మరిన్ని బస్సులు పెంచుతామని అధికారులు తెలిపారు. భక్తులు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీస్ఆర్టీసీ అధికారులు కోరారు.
శ్రీరామ నవమి సందర్భంగా #Hyderabad నుంచి భద్రాచలానికి #TSRTC 70 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లే భక్తుల కోసం 9, 10 తేదీల్లో రెగ్యులర్ సర్వీసులకు అదనంగా 70 స్పెషల్ సర్వీసులు నడుపుతున్నట్లు తెలిపారు. @tsrtcmdoffice
— AIR News Hyderabad (@airnews_hyd) April 9, 2022