తారక్, చెర్రీ 'డేంజరస్ 2.0' వీడియో.. ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వర్మ

by Harish |   ( Updated:2022-04-06 15:24:21.0  )
తారక్, చెర్రీ డేంజరస్ 2.0 వీడియో.. ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వర్మ
X

దిశ, సినిమా: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ ఉండే రాంగోపాల్ వర్మకు స్టార్లపై కామెంట్స్ చేయందే పొద్దు పోదు. నిత్యం వారి యాటిట్యూడ్, స్టార్‌డమ్‌పై నెగెటివ్‌గా స్పందించే వర్మ.. ఈ మధ్య కాస్త మెతక వైఖరి ప్రదర్శిస్తున్నాడు. 'ఆర్‌ఆర్‌ఆర్' విషయంలో ఆయనే చేసిన సానుకూల వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుండగా.. రిలీజ్‌కు ముందు ప్రమోషన్స్‌లో 'చెర్రీ అండ్ తారక్' చిలిపి చేష్టలపై ఓ వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు వర్మ. దీనికి 'డేంజరస్ 2.0' అని క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఇక ఈ వీడియోకు ఫ్యాన్స్ వీర లెవెల్‌లో రెస్పాండ్ అవుతున్నారు. ఈ వీడియోలో ఎన్టీఆర్‌, చెర్రీ మధ్య గిలిగింతల సీన్లు అభిమానులను అలరిస్తుండగా.. షేర్ చేసిన గంటలోనే వెయ్యికి పైగా రీట్వీట్లు నమోదవడం విశేషం.

Advertisement

Next Story