Renuka Chowdhury: రేణుకా చౌదరి హల్‌చల్.. ఎస్సై కాలర్ పట్టుకుని నిలదీత

by Sathputhe Rajesh |   ( Updated:2022-06-16 07:57:25.0  )
Renuka Chowdhury warns panjagutta si at raj bhavan protest
X

దిశ, వెబ్‌డెస్క్: Renuka Chowdhury warns panjagutta si at raj bhavan protest| రాహుల్ గాంధీపై ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ చేపట్టిన చలో రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. రాజ్ భవన్ ముట్టడికి వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, శ్రీధర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతమంది కాంగ్రెస్ శ్రేణులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి హల్ చల్ చేశారు. తనను అరెస్ట్ చేయడానికి వచ్చిన ఎస్సై కాలర్ పట్టుకుని నిలదీశారు. తనను టచ్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. మహిళా పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా వారిపై రెచ్చిపోయారు. ఒక మహిళా పోలీస్ ను చేతిలో కొట్టారు. దీంతో ఆమెను బలవంతంగా మహిళాలు వ్యాన్ లోకి ఎక్కించారు.



Next Story

Most Viewed