రూ. 5.84 లక్షల ప్రారంభ ధరతో సరికొత్త 'కైగర్‌'ను విడుదల చేసిన రెనాల్ట్!

by Harish |
రూ. 5.84 లక్షల ప్రారంభ ధరతో సరికొత్త కైగర్‌ను విడుదల చేసిన రెనాల్ట్!
X

న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థ రెనాల్ట్ తన కాంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్ కైగర్ సరికొత్త అప్‌డేటెడ్ వెర్షన్‌ను భారత మార్కెట్లో బుధవారం విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్ ప్రారంభ ధరను రూ. 5.84 లక్షలుగా నిర్ణయించినట్టు కంపెనీ తెలిపింది. మల్టీ-సెన్స్ డ్రైవింగ్ మోడ్‌లతో పాటు కేబిన్ స్టోరేజ్, కార్గో స్పేస్‌లతో సహా అత్యాధునిక ఫీచర్లను కైగర్-2022 మోడల్‌లో అందించామని కంపెనీ వెల్లడించింది. ముఖ్యంగా దేశీయ వినియోగదారుల నుంచి లభిస్తున్న మెరుగైన ఆదరణను దృష్టిలో ఉంచుకుని గ్లోబల్ మార్కెట్ల కంటే ముందుగా భారత మార్కెట్లో ఈ సరికొత్త వెర్షన్‌ను తీసుకొచ్చామని, మాన్యువల్, ఆటోమెటిక్ వేరియంట్లలో ఇది లభిస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

కారు లోపలి భాగంలో గాలి నాణ్యతను అందించేందుకు అధునాత పీఎం2.5 అట్మాస్ఫియరిక్ ఫిల్టర్‌ను కంపెనీ ఇందులో అందిస్తోంది. అంతేకాకుండా వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ సదుపాయం, క్రూజ్ కంట్రోల్ ఫంక్షన్ లాంటి కొత్త ఫీచర్లను ఈ మోడల్‌లో లభిస్తాయని వివరించింది.

Advertisement

Next Story

Most Viewed