- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RRR లో రామ్ చరణ్‌కే ఎక్కువ ప్రాధాన్యత.. క్లారిటీ ఇచ్చిన JR.NTR
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ యాక్టర్స్ ఎన్టీఆర్, రాంచరణ్ మల్టీస్టారర్‌గా.. టాలెంటెడ్ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' సినిమా పలు రికార్డ్‌లు సృష్టిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే 500కోట్లు రాబట్టి.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది ఆర్ఆర్ఆర్. చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా.. మూవీ యూనిట్‌కు ధన్యవాదాలు తెలుపుతూ.. ఓ లేఖ విడుదల చేశారు హీరో ఎన్టీఆర్. ఇందులో ఆర్ఆర్ఆర్ సినిమా కోసం పని చేసిన నటులకు, సిబ్బందికి, టెక్నికల్ టీంకు, ప్రతి ఒక్క విభాగానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ లేఖలో కో యాక్టర్ రాంచరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు తారక్. ' అసలు రాంచరణ్ లేకుండా ఆర్ఆర్ఆర్ ఊహించుకోలేనని.. అల్లూరి పాత్రకు చెర్రీ తప్ప ఎవరు న్యాయం చేయాలేరని' అని రాసుకొచ్చాడు. ఇదిలా ఉంటే.. ట్రిపులార్ సినిమాలో రాజమౌళి ఎన్టీఆర్ కంటే.. రాంచరణ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్న సమయంలో.. ఒక్క లేఖతో అన్ని వార్తలకు చెక్ పెట్టాడు తారక్.