- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాం చరణ్ అయ్యప్పమాలలో కడప దర్గాకు వెళ్లడంపై నెట్టింట రచ్చ.. గట్టిగా ఇచ్చి పడేసిన మెగా కోడలు(పోస్ట్)
దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల అయ్యప్ప మాలలో ఉండి కడపలోని పెద్ద దర్గాను దర్శించుకున్న సంగతి తెలిసిందే. 80వ నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అక్కడి సమీపంలోని విజయ దుర్గ ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే గతంలో ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహమాన్‌కు ఇచ్చిన మాట ప్రకారం అయ్యప్ప స్వామి మాలలోనే కడప దర్గాను దర్శించుకున్నారు. దీనిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. రామ్ చరణ్ పై నెట్టింట విమర్శలు కురిపిస్తున్నారు. అయితే వీటిపై మెగా పవర్ స్టార్ స్పందించకున్నా ఆయన సతీమణి ఉపాసన కొణిదెల మాత్రం స్పందించింది. రామ్ చరణ్ అన్ని మతాలను గౌరవిస్తుంటారని చెబుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
తాజాగా ఉపాసన ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో చరణ్ దర్గాలో ప్రార్థనలు చేస్తోన్న ఫొటోను షేర్ చేస్తూ సారే జహాసె అచ్ఛా హిందుస్తాన్ హమారా అనే గీతాన్ని జోడించింది ఉపాసన.. అలాగే ‘దేవుడిపై విశ్వాసం అందరినీ ఏకం చేస్తుంది. అంతే కానీ చిన్నాభిన్నం చేయదు. భారతీయులుగా మేం అన్ని మత విశ్వాసాలు, సంప్రదాయాలు, ఆచారాలను గౌరవిస్తాం. ఐక్యతలోనే మా బలం ఉంది. రామ్‌చరణ్ తన మతాన్ని అనుసరిస్తూనే ఇతర మతాలనూ ఎప్పుడూ గౌరవిస్తుంటారు’ అని రాసుకొచ్చింది. దీనికి ‘వన్ నేషన్.. వన్ స్పిరిట్’ అని హ్యాష్ ట్యాగ్ కూడా జోడించింది మెగా కోడలు. దీంతో ఈ పోస్ట్ కాస్త వైరల్ అయింది. ఇక దీనిని చూసిన నెటిజన్లు, మెగా ఫ్యాన్స్ నువ్వు సూపర్ వదినా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.