- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Agnipath Scheme: అధికారంలోకి రాగానే 'అగ్నిపథ్' రద్దు చేస్తాం: రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: Rahul Gandhi Demands To Withdraw Agnipath Scheme| కేంద్ర ప్రభుత్వం సైనిక నియమాకాల కోసం ఇటీవల తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌పై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఆర్మీని బలహీనపరుస్తూ.. పైగా జాతీయవాదులమంటూ చెప్పుకుంటున్నారంటూ విమర్శించారు. ఇటీవల తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశ యువత అన్ని గమనిస్తున్నారని.. మేం అధికారంలోకి రాగానే అగ్నిపథ్‌ను రద్దు చేస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పుడేమో ఒక ర్యాంక్, ఒక పెన్షన్ గురించి మాట్లాడారు.. ఇప్పుడేమో నో ర్యాంక్, నో పెన్షన్ అంటున్నారంటూ ఎద్దేవా చేశారు.
ఇదిలా ఉంటే, అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అభ్యర్థులు రోడ్లపైకి తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పథకంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రైతు చట్టాలను వెనక్కి తీసుకున్న విధంగానే అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అధికార బీజేపీ మాత్రం అగ్నిపథ్ విషయంలో వెనక్కి తగ్గడం లేదు.