భగవంతుని సేవపై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ కీలక వ్యాఖ్యలు

by Nagaya |
భగవంతుని సేవపై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, జవహర్ నగర్: భక్తులకు చేసే సేవే భగవంతుని సేవగా భావిస్తామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ భగవత్ అన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఆదివారం సీపీ మహేశ్ భగవత్ యాదాద్రి ఆలయాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఆలయ ప్రాంగణాన్ని సీపీ కెమెరాల్లో పర్యవేక్షించి మార్చి 28న నిర్వహించనున్న ఆలయ ప్రారంభోత్సవ వేడుకలకు ఏర్పాట్లను చేయాలని అధికారులను ఆదేశించారు. మార్చి 28న సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆలయాన్ని ప్రారంభిస్తారని సీపీ తెలిపారు. మీడియాతో మాట్లాడిన సీపీ.. ప్రారంభోత్సవానికి రాచకొండ పోలీసుల ద్వారా అన్ని రకాల సెక్యూరిటీ ప్రోటోకాల్‌లు అందజేస్తామని, ఆలయ ప్రాంగణంలో సీసీటీవీలు ఏర్పాటు చేస్తున్నామని హామీ ఇచ్చారు.

ఆలయ పరిరక్షణకు ఎస్పీఎఫ్‌కు చెందిన ప్రత్యేక బృందాన్ని నియమిస్తామని సీపీ పేర్కొన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులందరినీ క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టామన్నారు. ఆలయ ప్రాంగణంలో సివిల్‌ పోలీస్‌ బృందాల ద్వారా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, మహిళా భక్తుల సహాయార్థం షీ టీమ్‌లను కూడా నియమిస్తామని సీపీ తెలిపారు. పోలీసులు సెక్యూరిటీ ప్రోటోకాల్‌లను భక్తులు పాటించాలని సీపీ సూచించారు. ఈ తనిఖీలో సీపీతో పాటూ డీసీపీ కె.నారాయణరెడ్డి, ఐటీ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌రెడ్డి ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed