- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KGF 2: తెలుగు రాష్ట్రాల్లో 'కేజీఎఫ్ 2'కష్టాలు.. మూడు రోజుల్లో..
దిశ, సినిమా: కన్నడ స్టార్ యశ్ నటించిన 'కేజీఎఫ్: చాప్టర్ 2'ఈ నెల 14న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలపై నిర్మాతలు కాస్త ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన 'ఆర్ఆర్ఆర్' మూవీ కోసం పది రోజులపాటు ధరలు పెంచేందుకు ప్రభుత్వాలు అనుమతివ్వగా.. ఈ సినిమాకు కూడా పెంచాలంటూ 'కెజిఎఫ్ 2' నిర్మాతలు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక రూ. 100 కోట్లకుపైగా బడ్జెట్‌తో పాన్-ఇండియా లెవల్లో రాబోతున్న తమ సినిమా ప్రభుత్వ షరతులకు లోబడే ఉందని, టికెట్ రేట్లు పెంచే అవకాశం ఇవ్వాలని మేకర్స్ కోరుతున్నారు.
కానీ ఏపీ ప్రభుత్వం ఈ కన్నడ మూవీకి బడ్జెట్ కోట్‌ని వర్తింపజేస్తుందో లేదో ఇంకా క్లారిటీ లేకపోగా.. తెలంగాణలోనూ ఇప్పటికీ టికెట్ ధరలు పెంపుపై ఎలాంటి సమాచారం లేదు. ఇక 'కెజిఎఫ్' ఫ్రాంచైజీ చుట్టూ నెలకొన్న క్రేజ్‌ను చూస్తుంటే, డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ మొత్తాలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుండగా.. భారీ వసూళ్లు రాబట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.