Prasanth Varma : హీరోయిన్ కావాలంటూ క్యాస్టింగ్ కాల్ యాడ్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ .. షాక్ అవుతున్న నెటిజన్స్

by Prasanna |   ( Updated:2024-10-14 14:40:30.0  )
Prasanth Varma : హీరోయిన్ కావాలంటూ క్యాస్టింగ్ కాల్ యాడ్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ .. షాక్ అవుతున్న నెటిజన్స్
X

దిశ, వెబ్ డెస్క్ : హనుమాన్ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ క్రియోట్ చేసి ఇండియా వైడ్ గా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇప్పటి నుంచి తన నుంచి వచ్చే సినిమాలన్నీ తన సినిమాటిక్ యూనివర్స్ లో వస్తాయని తెలిపాడు. హనుమాన్ సినిమా తర్వాత జై హనుమాన్, బాలయ్య బాబు తనయుడుతో ఒక సినిమా ప్రకటించారు. ఇవి మాత్రమే కాకుండా దసరాకు మహాకాళి అనే కొత్త సినిమాను ప్రకటించాడు.

మహాకాళి పోస్టర్ విడుదల చేయగా ఓ పులి, ఓ చిన్నపిల్ల హత్తుకొని ఉన్నట్టు చూపించారు. అయితే, తాజాగా ఈ సినిమాకు హీరోయిన్ కావాలంటూ క్యాస్టింగ్ కాల్ యాడ్ ఇవ్వడంతో నెటిజెన్స్ షాక్ అవుతున్నారు.

హీరోయిన్ ని ఫిక్స్ చేయకుండా పోస్టర్ ఎలా రిలీజ్ చేసారంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఫస్ట్ ఫిమేల్ సూపర్ హీరో పాత్ర చేయడానికి ఒక అమ్మాయి కావాలంటూ ఓ పోస్టర్ ప్రశాంత్ వర్మ షేర్ చేసాడు. వయస్సు 16 – 25 మధ్య ఉండి యాక్టింగ్, డ్యాన్స్ వచ్చిన ఇండియన్ అమ్మాయి కావాలంటూ యాడ్ ఇచ్చాడు. ఆసక్తి ఉన్నవాళ్లు పోస్టర్ లో ఉన్న మెయిల్ ఐడికి డీటెయిల్స్ పంపించండి. మెయిన్ లీడ్ ఎంచుకోకుండా సినిమా అనౌన్స్ చేయడంతో కొందరు షాక్ అవుతున్నారు.


Advertisement

Next Story