- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండోసారి గోవా సీఎంగా ప్రమోద్ సావంత్
పనాజీ: గోవాలోనూ సీఎంగా క్రితంసారి అభ్యర్థికే అధిష్టానం మొగ్గు చూపింది. ప్రమోద్ సావంత్ రెండోసారి గోవా సీఎం గా నిర్ణయించినట్లు ప్రకటించింది. కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ఎల్ మురుగన్ సమక్షంలో సోమవారం జరిగిన పార్టీ శాసనసభ్య సమావేశంలో సావంత్‌నే సీఎంగా ఖరారు చేసింది. అయితే మరో ఎమ్మెల్యే విశ్వజిత్ రాణే నుంచి ఆయనకు పోటీ ఎదురైనప్పటికీ, కేంద్రం మాత్రం సావంత్ పేరునే ప్రకటించింది. ఈ సందర్భంగా సావంత్ మాట్లాడుతూ.. ఆత్మనిర్భర్ భారత్ లాగే, స్వయం పూర్ణ గోవా కొరకు కృషి చేస్తానని జాతీయ మీడియాకు తెలిపారు.
తనకు తిరిగి అధికార బాధ్యతలు కట్టబెట్టినందుకు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తనకు సాధ్యమైనంత మేర కృషి చేస్తానని చెప్పారు. 2019లో సావంత్ తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో సగం స్థానాల్లో గెలుపొంది బీజేపీ కొత్త రికార్డును సాధించింది. దీంతో వరుసగా మూడోసారి కాషాయ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. స్థానిక పార్టీల మద్దతుతో తిరిగి అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది.