Post Office Scheme: 417 రూపాయల పొదుపుతో కళ్లు చెదిరే లాభం

by Harish |   ( Updated:2022-06-23 12:29:05.0  )
Post Office Scheme: 417 రూపాయల పొదుపుతో కళ్లు చెదిరే లాభం
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో Post Office వినియోగదారుల కోసం సరికొత్త పొదుపు పథకాలు తీసుకొస్తుంది. బ్యాంకులతో పాటు సమానంగా డిపాజిట్లను పెంచుకుంటూ పోతున్న పోస్టాఫీసు వరుసగా కొత్త కొత్త స్కీమ్‌లను ప్రవేశపెడుతుంది. చిన్న ఉద్యోగాలు చేసే వారి కోసం ఉపయోగకరంగా ఉండేందుకు Post Office కొత్తగా ఒక పొదుపు పథకాన్ని తీసుకొచ్చింది. పోస్టాఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌ పథకం ద్వారా ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం కంటే ప్రతిరోజు చిన్న అమౌంట్‌ను పొదుపు చేయడం ద్వారా కోటీశ్వరులు కావచ్చు. రోజు రూ. 417 రూపాయలు పెట్టుబడి పెట్టడం ద్వారా కోటి రూపాయల లాభాన్ని పొందవచ్చు.

పోస్టాఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మెచ్యూరిటీ సమయంలో కళ్లు చెదిరే లాభాలను పొందవచ్చు. ఈ పథకంలో రోజు రూ. 417 పెట్టుబడి పెట్టాలి. అంటే సంవత్సర ప్రాతిపదికన గరిష్టంగా రూ. 1.5 లక్షలు లేదా నెలకు రూ. 12,500 అవుతుంది. ఈ ఖాతా మెచ్యూరిటీ వ్యవధి 15 సంవత్సరాలు. మొత్తం పెట్టుబడి రూ. 22.50 లక్షలు అవుతుంది. మెచ్యూరిటీ తర్వాత 7.1 శాతం వార్షిక వడ్డీ రేటు వస్తుంది. అంటే వడ్డీ రూ. 18.18 లక్షలతో, మొత్తం రూ.40.68 లక్షలు వస్తాయి. ఇంకా పథకంలో ఉండాలనుకుంటే, దీన్ని మరో 5-5 సంవత్సరాలకు రెండు సార్లు పొడిగించవచ్చు. దీని వలన అదనంగా లాభం పొందవచ్చు. 15+5+5=25 సంవత్సరాలు, సంవత్సరానికి రూ.1.5 లక్షలు పెట్టుబడి పెడితే మొత్తం పెట్టుబడి రూ.37.50 లక్షలు అవుతుంది. 7.1 శాతం వడ్డీ రేటుతో, మెచ్యూరిటీ సమయంలో రూ. 65.58 లక్షలు వస్తాయి. అంటే, 25 ఏళ్ల తర్వాత మొత్తం రూ. 1.03 కోట్లు చేతికి వస్తాయి.

అర్హత

స్వయం ఉపాధి పొందేవారు, జీతం తీసుకునేవారు, పెన్షనర్‌లతో సహా ఎవరైనా పోస్ట్ ఆఫీస్ PPF ఖాతాను తెరవవచ్చు. దీనిలో ఒక వ్యక్తికి ఒక ఖాతా మాత్రమే ఇస్తారు. ఎలాంటి జాయింట్ ఖాతాలు ఉండవు. మైనర్ పిల్లల తరఫున తల్లిదండ్రులు/ సంరక్షకులు మైనర్ PPF ఖాతాను తెరవవచ్చు. NRI లకు ఇందులో ఖాతా ఉండదు. అర్హత కలిగిన వారు ఓటరు ID, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు మొదలగు వాటిని తీసుకుని దగ్గరలోని పోస్టాఫీసులో సంప్రదించగలరు.

మరిన్ని వార్తలు :

Post Office FD Interest Rates: పోస్టాఫీసులో FD ల పై వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి

Advertisement

Next Story

Most Viewed