- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL లో బెట్టింగ్ పెడుతున్నారా.. పోలీసుల హెచ్చరిక ఇదే!
దిశ, డైనమిక్ బ్యూరో: క్రికెట్ అభిమానుల్లో మరింత జోష్ పెంచేందుకు ఐపీఎల్ సీజన్ 15 వచ్చేసింది. ఎన్నో అంచనాల మధ్య రెండేళ్ల తర్వాత ప్రేక్షకుల నడుమ మార్చి 26న మొదలైన ఐపీఎల్.. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గతేడాది కరోనా కారణం దుబాయ్‌లో మ్యాచ్‌లు నిర్వహించిన బీసీసీఐ.. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది స్వదేశంలోనే నిర్వహిస్తోంది. అయితే, ఐపీఎల్ అంటే ఎక్కువ గుర్తొచ్చేది బెట్టింగ్. తాను ఎంచుకున్న జట్టుపై బెట్టింగ్‌లు పెట్టి కొందరు లాభాలు పొందుతుంటే.. చాలా మంది నష్టపోయి ఇబ్బందులు పడుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం.
ఈ క్రమంలో క్రికెట్ బెట్టింగ్‌లపై హైదరాబాద్ సిటీ పోలీసులు సోషల్ మీడియా వేదికగా అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చారు. ఒక్కరు చేసిన పనికి కుటుంబమంతా నష్టపోతుందని పోలీసులు అవగాహన కల్పిస్తూ పోస్ట్ చేశారు. ''క్రికెట్ బెట్టింగ్ ఒక విధ్వంసక వ్యాధి.. ఒక్కసారి బానిస అయితే కుటుంబం మొత్తం బాధపడుతుంది. దీనికి పాల్పడితే ఎప్పుడు విజేతగా నిలువలేరు. తెలంగాణ గేమింగ్ సవరణ చట్టం-2017 ప్రకారం పబ్లిక్ గేమింగ్ అమలు చేయడం లేదా నిర్వహించడం నిషేధం. ఈ చట్టాన్ని ఉల్లంఘించినట్లైతే ఒక సంవత్సరం జైలు శిక్ష తప్పదని'' హెచ్చరిస్తూ పోస్ట్ చేశారు.
Betting is a destructive disease - one person may be addicted but the whole family suffers.
— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) March 29, 2022
It is predictable, that is you can't be the winner forever.
The safe way to double your money is to fold it over once and put it in your pocket.#SayNoToBetting #IPL #IPL2022 #TataIPL pic.twitter.com/mpmnl2YBKu