- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్లూటోలో జీవం ఆనవాళ్లు.. భారీ మంచు అగ్నిపర్వతాలు
దిశ, వెబ్‌డెస్క్: ప్లూటో గ్రహంలో జీవం ఆనవాళ్లు ఉన్నట్లేనా.. అవునంటున్నారు నాసా శాస్త్రజ్ఞులు. ప్లూటోపై నాసా ప్రయోగించిన న్యూ హారిజన్స్ మిషన్ ఆశ్చర్యకరమైన విషయాన్ని కనుగొంది. అత్యంత చిన్నదైన ప్లూటో గ్రహంపై మంచు అగ్నిపర్వతాలు ఉన్నట్లు నాసా ఉపగ్రహం కనిపెట్టింది. సూర్యుడికి అతి దూరంలో గడ్డకట్టిన రూపంలోని పదార్ధాల్లో ప్లూటో అతిపెద్దది. మైనస్ 232 సెల్సియస్ డిగ్రీల సగటు ఉష్ణోగ్రత లో ఉండే ఈ మంచు ప్రపంచం.. పర్వతాలకు, లోయలకు, గ్లేసియర్లకు, మైదానాలకు, బిలాలకు నిలయం. మన సౌర వ్యవస్థకు భిన్నమైన మంచు అగ్నిపర్వతాలతో కూడిన అతిపెద్ద క్షేత్రం ప్లూటోలో ఉన్నట్లు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఈ గ్రహం వాయవ్య ప్రాంతంలో వెయ్యికిలోమీటర్ల పొడవునా ఉంటున్న ప్రాచీన బేసిన్‌లో స్పుత్నిక్ ప్లాంటినా మంచు ఉపరితలంపై ఈ మంచు అగ్నిపర్వతం ఆనవాళ్లు కనిపించాయని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు.
ఈ అగ్నిపర్వతం చాలావరకు నీటితో నిండివుందని, ఇది అగ్నిపర్వత గుమ్మటాలతో నిండి ఉందని తెలిపారు. అయితే ఇవి మంచు అగ్నిపర్వతాలు కాబట్టి వీటి లోపల నుంచి ఉబికివస్తున్న నీరు ఉపరితలంపై గడ్డకట్టుకు పోతుందని చెప్పారు. ప్లూటో అంతర్భాగం ఇంతకు ముందు ఊహించిన దానికంటే తక్కువ ఉష్ణోగ్రతతో వెచ్చగా ఉంటోందని తెలియడంతో కచ్చితంగా అక్కడ జీవం ఉనికి ఉండవచ్చని ఊహిస్తున్నారు. అయితే ఇక్కడి వాతావరణంలో ప్రాణులు మనగలుగుతున్నాయని నిరూపించేందుకు అనేక సవాళ్లు ఎదురవుతాయని చెప్పారు. భవిష్యత్తులో అధునాతన ఉపగ్రహాలను పంపించగలిగితే మంచులోకి చొచ్చుకుపోయే రాడార్‌ని నేరుగా ప్లూటో మంచు అగ్నిపర్వతంలోకి దింపి దాంట్లో జీవం ఆనవాళ్లను కనిపెట్టవచ్చని నాసా శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు.