Payyavula Keshav: చంద్రబాబు పెగాసెస్​ కొనలేదు

by Nagaya |   ( Updated:2022-07-07 09:51:31.0  )
Payyavula Keshav: చంద్రబాబు పెగాసెస్​ కొనలేదు
X

దిశ, డైనమిక్​ బ్యూరో : Payyavula Keshav Comments On Pegasus Issue| టీడీపీ అధినేత చంద్రబాబు పెగాసెస్​ ఎక్యూప్​మెంట్​​ కొన్నారనడంలో నిజం లేదని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్​ స్పష్టం చేశారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఎటువంటి ఎక్యూప్​మెంట్​ కొనలేదని గౌతమ్ సవాంగ్ ఆర్‌టీఐ సమాధానం ఇచ్చారని తెలిపారు. వైసీపీ కేవలం అసత్య ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. దీన్ని ఆసరాగా తీసుకుని చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి నిరూపించేందుకు ప్రభుత్వం ఉద్యోగస్తులను వేధించిందని ఆరోపించారు. మంత్రి బుగ్గన రాజేందర్ ఎమ్మెల్యేలకు ఇచ్చిన ల్యాప్‌ట్యాప్‌లు ఏ ఎమ్మెల్యే వాడటంలేదని తెలిపారు. సమాజానికి హానికరమైన వ్యక్తులపై పెట్టాల్సిన నిఘా టీడీపీ నాయకులపై పెడుతున్నారని కేశవ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed