- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మిస్ ఫైర్‌ను తీవ్రంగా తీసుకున్నాం: రాజ్‌నాథ్ సింగ్
న్యూఢిల్లీ: భారత క్షిపణి వ్యవస్థ అత్యంత విశ్వసనీయతతో పాటు సురక్షితమైనదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మంగళవారం లోక్‌సభలో పాకిస్తాన్ భూభాగంలో పొరపాటును క్షిపణి పడటంపై ఆయన వివరణ ఇచ్చారు. ప్రమాదవశాత్తు జరిగిన క్షిపణి కాల్పులపై ఆయన విచారం వ్యక్తం చేశారు. కేంద్రం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. దీనిపై ఇప్పటికే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. నేను ఈ నెల 9న జరిగిన సంఘటన గురించి సభకు తెలియజేయాలని అనుకుంటున్నాను. ప్రయోగ పరీక్షలో ప్రమాదవశాత్తు ఇది జరిగింది. క్షిపణి సాధారణ నిర్వహణలో ఒక మిస్సైల్ ప్రమాదవశాత్తు బయటపడింది అని అన్నారు. విచారణలో వాస్తవం ఏంటో అర్థమవుతుందని చెప్పారు. మన ఆయుధ వ్యవస్థ అత్యంత సురక్షితమైనదని, భద్రతతో కూడుకున్నదని తెలిపారు. మన భద్రత విధానాలు, ప్రోటోకాల్స్ ఉన్నతంగా ఉన్నాయని వెల్లడించారు.