- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూడు కొత్త రకం ప్రజాతి బల్లులను కనుగొన్న ఓయూ శాస్త్రవేత్తలు
దిశ, సికింద్రాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మూడు కొత్త రకం ప్రజాతి బల్లులను కనుగొన్నారు. ఉస్మానియా వర్సిటీ జువాలజీ విభాగ అధ్యాపకులు డాక్టర్ చలమల శ్రీనివాసులు మరో ఇద్దరు పరిశోధన విద్యార్థులు ఆదిత్య శ్రీనివాసులు, చేతన్ కుమార్‌లు కలిసి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో గోదావరి పరివాహక ప్రాంతాల్లోని బల్లుల జాతుల పై పరిశోధనలు చేసి మూడు రకాల కొత్త జాతులు ఉన్నట్లుగా గుర్తించారు.
ఇంగ్లీష్ జువాలజిస్ట్ డాక్టర్ బ్లాక్ఫోర్డ్ 1872లో భద్రాచలం గోదావరి పరివాహక ప్రాంతం, కావేరి , కృష్ణా నది పరివాహకప్రాంతాల్లో బల్లులపై పరిశోధనలు చేసి ఈ ప్రాంతంలో సాధారణ బల్లులకు భిన్నమైన పెద్ద శరీరం కలిగిన బల్లులు ఉన్నట్లు గుర్తించాడు. ఆయన పరిశోధనల ఆధారంగా ఈ ముగ్గురు శాస్ర్తవేత్తలు అప్పటి రకం జాతులు ఉన్నాయా..? ఉంటే ఇప్పుడు ఎలా ఉన్నాయి..? అనే విషయాలపై పరిశోధనలు మొదలు పెట్టారు.
పలు ప్రాంతాల్లో పర్యటించిన వీరు.. కర్నాటక, తెలంగాణలో బ్లాక్ఫోర్డ్ సూచించిన రకం బల్లులు ఉన్నాయని, అయితే అవి పూర్తిగా ఆయన చెప్పిన తెగకు చెందినవి కాదని, ఇవన్నీ కొత్త రకం లక్షణాలు కలిగి ఉన్నట్లు గుర్తించారు. ఈ బల్లులు ఆకారంలో పెద్దగా ఉన్నప్పటికీ వాటి శరీరం పెద్ద పెద్ద మచ్చలు, పొలుసులు, సూక్ష్మమైన వైవద్యాలు ఉన్నట్లుగా గుర్తించారు.
అందులో కర్ణాటకలోని బళ్లారి జిల్లాలోని హంపి ప్రాంతంలో హెమిడాక్టిలస్ రేయా అనే ప్రజాతి, కర్ణాటకలోని రాయచూర్ జిల్లా, రాయచూర్ కోట ప్రాంతంలో హెమిడాక్టిలస్ శాక్సికోలస్ అనే ప్రజాతి, తెలంగాణలోని నల్గొండ జిల్లా పానగల్ సమీపంలోనిచందన పల్లిలో ఎమ్యూలస్ లీయోఫోర్డ్ ప్రతి జాతికి చెందిన మూడు రకాల బల్లులను కనుగొన్నారు.
ఇవీ మూడు కొత్త రకం జాతులే..
మూడు ప్రాంతాల్లో కనుగొన్న మూడు బల్లుల ప్రజాతులు కొత్తరకానికి చెందినవేనని సైంటిస్టులు నిర్దారించారు. వీటిలోని 36 నుంచి 46 రకాల లక్షణాలను పరిశోధించిన సైంటిస్టులు 1872లో ఆంగ్ల జువాలజిస్ట్ బ్లాక్ఫోర్ట్ చెప్పిన రకానికి చెందిన బల్లుల పోలికలు ఉన్నప్పటికీ వాటి ఇతర లక్షణాలు క్షుణ్ణంగా పరిశీలిస్తే అవన్ని కొత్త రకానికి చెందినవిగా గుర్తించారు. ఇవి 12 అంగుళాల నుంచి 14 అంగుళాల పొడవు కలిగి ఉంటాయని, వీటి శరీనంపై పెద్ద పెద్ద మచ్చలు, పొలుసులు, వాటిపై చిన్న కూడా చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయని గుర్తించారు.
ఈ కొత్తరకం ప్రజాతి బల్లులు కేవలం రాతి కట్టడాలు, రాళ్లు, పురాతన రాతి కట్టడాలు, పెద్ద పెద్దరాతి కోటలు వంట ప్రాంతాల్లో నివసిస్తాయని సైంటిస్టులు గుర్తించారు. ఇవిపూర్తిగా కొత్త రకం ప్రజాతికి చెందిన మూడు ప్రత్యేకమైన జాతులు అని, ఇలాంటి ప్రజాతులు ప్రపంచ వ్యాప్తంగా173 ప్రజాతులు ఉన్నట్లు జువాలజీ సైంటిస్టు ప్రొఫెసర్ శ్రీనివాసులు తెలిపారు.
వీటి వల్ల ఉపయోగాలు ఏమిటి..
ఇవన్నీ రాతి కట్టడాలు, రాళ్లు, పురాతన కోటలో నివాసముంటారు. ఇవి ఎక్కువగా పొలాల్లో పంటలను నాశనం చేసే క్రిములను తిని రైతులకు మేలు చేస్తాయి. ముఖ్యంగా నిషాచర జీవులను తింటాయి. ఎక్కువగా పంటలకు నష్టం కలిగించే పరుగులను తింటూ రైతులకు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు తెలిపారు.