80W ఫాస్ట్ చార్జింగ్‌తో OnePlus 10 Pro

by Harish |
80W ఫాస్ట్ చార్జింగ్‌తో OnePlus 10 Pro
X

దిశ,వెబ్‌డెస్క్: చైనా టెక్నాలజీ దిగ్గజం వన్‌ప్లస్ మార్చి 31న ఇండియాలో వన్‌ప్లస్ 10 ప్రోను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. కంపెనీ ట్విట్టర్‌ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. OnePlus 10 Pro 120Hz రిఫ్రెష్ రేట్, AMOLED డిస్ప్లే, Qualcomm Snapdragon 8 Gen 1 చిప్‌సెట్‌ని కలిగి ఉంటుంది.

OnePlus 10 Pro స్పెసిఫికేషన్స్(అంచనా)

OnePlus 10 Pro స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 చిప్‌సెట్‌తో పాటు 12GB LPDDR5 ర్యామ్‌ను కలిగి ఉంటుంది.

ఇది ColorOS 12.1 ఆధారంగా Android 12 లో రన్ అవుతుంది.

స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల QHD+ డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.

OnePlus 10 Proలో 50MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 8MP టెలిఫోటో లెన్స్‌తో, 48MP మెయిన్ లెన్స్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంది.

ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉంది.

80W ఫాస్ట్ చార్జర్‌తో, 5,000mAh బ్యాటరీ ఉంటుంది. 50W వైర్‌లెస్ చార్జింగ్, రివర్స్ వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంది.

ఫోన్ వాల్కానిక్ బ్లాక్, ఎమరాల్డ్ ఫారెస్ట్ కలర్ వేరియంట్‌లలో ఇండియాలో లాంచ్ కానుంది.



Advertisement

Next Story

Most Viewed