దుమ్ముగూడెం బరాజ్ రీసర్వే.. వాటిపై కూడా అధ్యయనం చేయాలని ఆదేశాలు

by Javid Pasha |   ( Updated:2022-04-11 17:02:48.0  )
దుమ్ముగూడెం బరాజ్ రీసర్వే.. వాటిపై కూడా అధ్యయనం చేయాలని ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : గోదావరిపై నిర్మించే దుమ్ముగూడెం బరాజ్​ ఎత్తు పెంపుపై సర్వేకు ప్రభుత్వం మరోసారి ఆదేశాలిచ్చింది. గతంలోనే దీనిపై సర్వే చేయగా.. పలు కారణాలతో నిలిపివేశారు. అయితే అప్పటికే సర్వే సంస్థకు నిధులు విడుదల చేశారు. తాజాగా దుమ్ముగూడెం బరాజ్​ ఎత్తు 1 మీటరు పెంచేందుకు రీ సర్వే చేయాలని కాన్​టెక్​ డీఈఎస్​ సంస్థకు ఆదేశాలిచ్చారు. దీని కోసం సవరణ అంచనాలతో రూ. 1.91 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం పాలన అనుమతులు జారీ చేసింది. దుమ్ముగూడెం బరాజ్​ నిర్మాణంలో భాగంగా రివర్​ బెడ్​, జియలాజికల్​ ఇన్వెస్ట్​గేషన్​, డిజైన్​, డ్రాయింగ్​తో పాటుగా ముంపు ప్రాంతాలపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

Advertisement

Next Story