Noodles: న్యూయర్ రోజున పొడవాటి నూడుల్స్ తప్పక తినాలంట.. ఎందుకంటే?

by Anjali |   ( Updated:2024-12-30 09:43:47.0  )
Noodles: న్యూయర్ రోజున పొడవాటి నూడుల్స్ తప్పక తినాలంట.. ఎందుకంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: కొత్త సంవత్సరం(న్యూ year) నాడు కేవలం కుటుంబ సభ్యులకు(Family members), ఫ్రెండ్స్(members, friends), సన్నిహితులకు ‘హ్యీపీ న్యూయర్’(Happy New Year) అంటూ విషెష్ తెలుపడమే కాకుండా పలు స్పెషల్ ఐటెమ్స్ తినడం కూడా ఆనవాయితీగా వస్తుందట. నూతన ఏడాది ఇవి తింటే కలిసి ఆరోగ్యం(Health), అదృష్టం(luck) కలిసివస్తుందని కొన్ని చోట్ల నమ్ముతారట. మరీ ఆ రోజున ఏం ఏం వంటకాలు(Recipes) చేసుకుని తినాలో సంప్రదాయంగా వస్తోన్న ఈ ఐటెమ్స్ ఏంటో చూద్దాం...

క్యాబేజీ(Cabbage)..

నూతన సంవత్సరం వేళ ఆకుపచ్చ కూరగాయల్ని తింటారట. అదేక్కడో కాదు.. అమెరికాలో అట. ఇది తింటే ఏడాది పొడవునా హెల్తీగా, సంపన్నమైన జీవితాన్ని గడుపుతారని అక్కడి జనాల విశ్వాసమట. అలాగే తూర్పు ఐరోపా(Europe)లో కూడా క్యాబేజీ(Cabbage) తింటారట.

స్వీట్ అండ్ కేక్(Sweet and cake)..

చాలా మంది కొత్త సంవత్సరం వచ్చిందని ఆనందంలో కేక్ కట్ చేస్తారన్న విషయం తెలిసిందే. ప్రస్తుత రోజుల్లో ఏ చిన్న పార్టీలకన్నా, పలు కార్యక్రమాలకు కేక్ కట్ చేస్తున్నారు. అయితే న్యూయర్ వేళ కేక్ తింటే మంచి లక్ వస్తుందని అమెరికా నుంచి గ్రీస్ వరకు చాలా దేశాల్లో కేక్ కట్ చేస్తారట.

పండ్లు తినడం..

పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న విషయం తెలిసిందే. అయితే 13 రకాల పండ్లను కొత్త సంవత్సరం నాడు తింటే సంతానం అవుతుందని, ఏడాదంతా అదృష్టం కలిసి వస్తుందని ఫిలిప్పీన్స్ ప్రజలు నమ్ముతారట.

నూడుల్స్..

జపాన్, చైనా, ఆసియా వంటి దేశాల్లో న్యూయర్ రోజు కచ్చితంగా నూడుల్స్(Noodles) తింటారట. పొడవాటి నూడుల్స్ దీర్ఘాయుష్షు(long life)కు చిహ్నమని విశ్వసిస్తారట. ఇవి తింటే ఆయుష్షు పెరుగుతుందట. ఓ షరతు కూడా ఉందట. నూడుల్స్ మొత్త నోట్లోకి వెళ్లాకే నమిలి తినాలని రూల్ ఉందట.

పరవన్నం..

హిందూ మతంలో రైస్ ఎంతో పవిత్రమైనవిగా చూస్తారు. కాగా ప్రత్యేక రోజుల్లో బియ్యంతో భీర్ లేదా పరవ్నం వంటి ఆహారాలను తప్పకుండా తినాలని కొన్ని ప్రదేశాల్లో నమ్ముతారట. బియ్యంలో తయారు చేసిన స్పెషల్ వంటకాన్ని న్యూయర్ రోజు చేసుకుని కొత్త సంవత్సరాన్ని స్టార్ట్ చేస్తారట.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed