- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘వాడు ఎంత పెద్ద తోపు అయినా పెళ్ళాం మాట వినాల్సిందే’.. మెగా హీరో షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా: మెగా హీరో వరుణ్ తేజ్(Varuntej) సొట్టబుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠి(Lavanya Thripati )ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి మెగా కోడలి స్టేటస్‌ను లావణ్య బాగా ఎంజాయ్ చేస్తోంది. పెళ్లి తర్వాత వరుణ్ సినిమాలు చేస్తూ విజయం కోసం తాపత్రయ పడుతున్నాడు. కానీ, హిట్ మాత్రం కొట్టలేకపోతున్నాడు. ప్రజెంట్ ‘మట్కా’(Matka) మూవీతో మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక లావణ్య విషయానికి వస్తే.. మ్యారేజ్ తర్వాత ‘మిస్ ఫర్ఫెక్ట్’(Miss Perfect) సిరీస్‌తో ప్రేక్షకులను అలరించింది. కానీ, ఆ తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్ ప్రకటించలేదు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతూ అభిమానులకు టచ్‌లో ఉంటుంది. అయితే తాజాగా వరుణ్ – లావణ్య ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ కూడా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ స్పెషల్ పెళ్లి ఫొటోలు, వీడియోలు తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్రమంలో వరుణ్ చేసిన కామెంట్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
తాజాగా వరుణ్ తేజ్ నటించిన మట్కా సినిమా ట్రైలర్ లాంచ్ జరిగింది. ఈ ఈవెంట్లో మట్కా మూవీలోని వరుణ్ తేజ్‌కి భార్య పాత్రలో నటించిన మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) పాత్ర గురించి ప్రశ్నించారు. దీనికి వరుణ్ తేజ్ సమాధానమిస్తూ.. ‘ప్రతి సక్సెస్ ఫుల్ అబ్బాయి జీవితంలో ఒక అమ్మాయి ఉంటుంది. ఈ సినిమాలో వాసు క్యారెక్టర్ని భయపెట్టేది కూడా కేవలం తన భార్య పాత్రే. అతను దారి తప్పుతున్నాడు అంటే సరి చేసేది భార్య పాత్రే. వాడు ఎంత పెద్ద తోపు అయినా పెళ్ళాం మాట వినాల్సిందే’ అని అన్నాడు. దీనికి మరి లావణ్య మాట మీరు వింటున్నారా అని అడగ్గా.. ‘లేడీస్ కూడా ఆలోచించి అడిగితే మేము కూడా ఆలోచించి ఓకే చెప్తాము. లావణ్య గారు ఏదైనా ఆలోచించి అడుగుతారు కాబట్టి నేను కూడా ఆలోచించి ఓకే చెప్తాను’ అని అన్నారు. ఇక పెళ్లయిన ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ తర్వాత వరుణ్ ఇలా మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Read More : మా ఆయనకు ఆ హీరోయిన్‌కు మధ్య ఉన్న కెమిస్ట్రీ బాగుంటుంది... మెగా కోడలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్