PAK New PM Viral Video: 'బ‌ల్లగుద్ది కాదు', 'మైక్ గుద్ది' చెప్పే పాకిస్థాన్ కొత్త ప్ర‌ధాని! వీడియో వైర‌ల్‌

by Sumithra |   ( Updated:2022-04-19 06:54:48.0  )
PAK New PM Viral Video: బ‌ల్లగుద్ది కాదు, మైక్ గుద్ది చెప్పే పాకిస్థాన్ కొత్త ప్ర‌ధాని! వీడియో వైర‌ల్‌
X

దిశ‌, వెబ్‌డెస్క్ః కొత్త పిచ్చోడు పొద్దెర‌గ‌డేమో గానీ కొత్త‌గా ఎన్నికైన పాకిస్థాన్ ప్ర‌ధాని మాత్రం అన్నీ ఎరిగిన వ్య‌క్తే. 70 ఏళ్ల షెహబాజ్ షరీఫ్, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా పాకిస్థాన్ ప్ర‌ధానిపై అవిశ్వాస తీర్మానం పెట్టి, ప‌థ‌కం ప్ర‌కారం గ‌ద్దెనెక్కిన వ్య‌క్తి. పాకిస్థాన్‌ను అత్యంత ఎక్కువ కాలం పాలించి, ప‌రాభ‌వింప‌బ‌డి, 10 ఏళ్ల జైలు శిక్ష అనుభ‌వించిన మాజీ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ సోదరుడిగా రాజ‌కీయాలు ఎరిగిన వ్య‌క్తి. విప్లవ ఉర్దూ కవుల రచనలను పీక‌ల‌దాక ఆశ్వాదించి, వాటినే ఊపిరి పీల్చుకునే నాయకుడిగా ప్రసిద్ధి చెందిన క‌ళా త‌ప‌స్వి. ఇన్ని ల‌క్ష‌ణాలున్న ఆయ‌న మాట కూడా అంతే ప్ర‌త్యేకంగా క‌నిపిస్తుంది. మైకులు బ‌ద్ద‌ల‌య్యేలా స్పీచ్ ఇస్తాడ‌నే పేరు సంపాదించుకున్న నాయ‌కుడు. దీన్ని రుజువు చేస్తూ, ష‌హ‌బాజ్ ష‌రీఫ్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న‌ప్పుడు ఆయన ప్రసంగాల నుండి తీసుకున్న కొన్ని వీడియోలు క్లిప్పులు ఇప్పుడు ఇంటర్నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

ఇక‌పై పాకిస్థాన్‌లో ఎంట‌ర్‌టైన్మెంట్‌కు ఢోకానే లేదంటూ ఈ ట్విట‌ర్ పోస్టు నెట్టింట్లో కామెడీ చేస్తోంది. ష‌హ‌బాజ్ షరీఫ్ ఉద్వేగభరిత ప్రసంగాలు మైక్‌లను ఎలా ఎగురేస్తాయో చూడండంటూ తెగ మురిసిపోతున్నారు జ‌నాలు. నెట్టింట వైర‌ల్ అయిన ష‌హ‌బాజ్ వీడియోలో సంజ్ఞలను చూసి, అతను స్కిజోఫ్రెనియా లక్షణాలు క‌లిగిన‌ బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్నాడంటూ ఓ నెటిజ‌న్ కామెంట్ చేశాడు. విపరీతమైన మానసిక కల్లోలం, తీవ్ర భయాందోళనలు ఆయ‌న‌ జీవితంలో ఒక భాగం అంటూ మ‌రో నెటిజ‌న్ విచారం వ్య‌క్తం చేశారు. పంజాబ్ ప్రావిన్స్‌కు వరుసగా మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ష‌హ‌బాజ్ ఇప్పుడు పాకిస్థాన్‌ను ఎలా పాలిస్తాడో వేచి చూడాలి. ఏదేమైనా, ప్ర‌ధానిగా మొద‌టి ప్ర‌సంగంలో ష‌హ‌బాజ్ పాకిస్థానీయుల‌చే 'శెభాష్..!' అనిపించుకునేట‌ట్లు కాశ్మీర్ అంశం లేవ‌నెత్తాడు. కాశ్మీర్‌లో 'శాంతి' నెల‌కొంటేనే ఇండియాతో పాకిస్థాన్ మైత్రి మెరుగ్గా ఉంటుందంటూ ఆయ‌న‌కు త‌గ్గ‌ట్టు హామీతో కూడిన హెచ్చ‌రిక లాంటి ఓ ర‌క‌మైన శ‌ప‌థం చేశాడు!



Advertisement

Next Story

Most Viewed