Akkineni Hero: పూరీ జగన్నాథ్ తో అక్కినేని హీరో.. అంత సాహసం ఇప్పుడు అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్

by Prasanna |   ( Updated:2024-10-16 15:41:12.0  )
Akkineni Hero: పూరీ జగన్నాథ్ తో అక్కినేని హీరో.. అంత సాహసం ఇప్పుడు అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పదేళ్ల కాలంలో ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించారు. అయితే, ఈ మధ్యకాలంలో హిట్స్ కంటే ఫ్లాప్ లే ఎక్కువగా చూస్తున్నారు. ఒకప్పుడు పూరీ నుంచి సినిమా వస్తుందంటే చాలు మాస్ అభిమానులు ముందు నుంచే టికెట్స్ బుక్ చేసుకునే వాళ్ళు. కానీ, ఇప్పుడు అలా లేదు తీసిన ప్రతీ మూవీ రిలీజ్ కు ముందు హైప్ ను క్రియోట్ చేస్తున్న విడుదలయ్యాక బోల్తా పడుతుంది.

పూరీ జగన్నాథ్ సినిమాలంటే ఇప్పటికీ చాలా మంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. విజయ్ దేవరకొండతో తీసిన లైగర్ మూవీ ఎంత పెద్ద ఫ్లాప్ అయిందో మనకీ తెలిసిందే. ఆ తర్వాత మళ్ళీ డబుల్ ఇస్మార్ట్ అంటూ రామ్ తో ఇంకో సినిమా తీసాడు, ఇది కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇప్పుడు, మరో కొత్త సినిమా తీయడానికి పూరి జగన్నాథ్ రెడీ అవుతున్నారు.

తెలుగు సినీ ఇండస్ట్రీలో వరస ప్లాపులు అందుకుంటున్న అక్కినేని హీరో అఖిల్ తో.. ఇప్పుడు పూరీ కొత్త సినిమా చేయబోతున్నారని వార్తలు బాగా వినిపిస్తున్నాయి. ఆర్థికంగా నలిగిపోతున్న ఈ డైరెక్టర్ పెద్ద రిస్క్ చేస్తాడా అనేది చూడాలి. కొందరు ఇపుడు అంత సాహసం అవసరమా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story