- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టాయిలెట్‌లో తినమంటారా ఏంటి?.. హీరోయిన్ ఫైర్
దిశ, సినిమా : 'ఫ్రీడమ్ టు ఫీడ్' కమ్యూనిటీని ఏర్పాటు చేసిన బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ నేహా ధూపియా వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వారోత్సవాల సందర్భంగా మరో మెసేజ్‌తో ముందుకొచ్చింది. పిల్లలకు తల్లి పాలివ్వడాన్ని లైంగిక దృష్టితో చూడకూడదని గతంలోనే కోరిన నేహా.. ఓ రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు ఎదురైన అనుభవాన్ని పంచుకుంది. బిడ్డకు పాలివ్వడంలో తనకు ఇబ్బంది తలెత్తడం చూసిన రెస్టారెంట్ ప్రతినిధులు.. ఆల్రెడీ లేడీస్ టాయిలెట్‌లో ఇందుకోసం ఓ సోఫా ఏర్పాటు చేసినట్లుగా తెలిపారని వివరించింది. ఆ విషయం విన్నాక చాలా బాధేసిందన్న ఆమె.. రెస్టారెంట్‌కు వచ్చే ప్రతీ ఒక్కరిని టాయిలెట్‌లో స్పేస్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్లి తినమని చెప్పలేరుగా! అని ప్రశ్నించింది. రెస్టారెంట్ ఓపెన్ చేసింది ప్రజలందరి కోసమే అయినప్పుడు.. తల్లి పాలు తాగే బిడ్డలకు సెపరేట్ స్పేస్ ఇవ్వలేరా? అని నిలదీసింది. ఈ విషయంపై వాయిస్ రైజ్ చేయాల్సిన అవసరముందని, ఈ పరిస్థితి నార్మలైజ్ అయ్యేదాకా పోరాడాలని పిలుపునిచ్చింది.