NASA: మార్స్‌పైకి రెండు హెలికాప్టర్లు పంపనున్న నాసా!

by Hajipasha |   ( Updated:2022-08-01 12:12:11.0  )
NASA Plans to Send Two Helicopters to Mars
X

దిశ, ఫీచర్స్: NASA Plans to Send Two Helicopters to Mars| అమెరికన్ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా.. 'మార్స్ శాంపిల్ రిటర్న్' ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఏజెన్సీ నుంచి అంగారక గ్రహం మీదకు పంపిన పర్సెవరెన్స్ రోవర్ అక్కడి ఉపరితల నమూనాలను సేకరించే పనిలో నిమగ్నమైంది. 2030 ప్రారంభం నాటికి ఆ శాంపిల్స్‌ను భూమిపైకి తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు.. నమూనాలను షటిల్ చేయడంలో సాయపడేందుకు మరొక రోవర్‌ను పంపాలని ప్రణాళికలు రూపొందించారు. కానీ ఇప్పుడు అదే పని పూర్తి చేసేందుకు రెండు హెలికాప్టర్ డ్రోన్స్ పంపబోతున్నట్లు ఏజెన్సీ తాజాగా ప్రకటించింది.

'జెజెరో' అనే బిలం అన్వేషణలో భాగంగా పర్సెవరెన్స్ రోవర్ రాక్ నమూనాలను డ్రిల్ చేస్తోంది. ఈ నమూనాల సేకరణతో పాటు వాటిని తిరిగి ల్యాండర్‌కు తీసుకెళ్లేందుకు ESA నిర్మించిన రోవర్‌ను పంపాలని శాస్త్రవేత్తలు భావించారు. కానీ రోవర్ డిజైన్ పెద్దదిగా మారడమే కాక అది రాకెట్‌తో పాటు ఒక ల్యాండర్‌కు సమానమైన బరువుకు చేరుకుంది. దీంతో ప్రణాళిక మార్చిన నాసా.. ఇప్పటికే అంగారకుడి పైకి పంపిన 'ఇన్‌జెన్యూనిటీ' హెలికాఫ్టర్ తరహాలో మరో రెండు వెహికల్స్ పంపేందుకు సిద్ధమైంది.

మొదటి ప్రణాళిక :

పర్సెవరెన్స్ రోవర్ సేకరించిన అన్ని నమూనాలను ముందుగా రాకెట్‌లోకి బదిలీ చేయాలి. అది చివరకు వాటిని భూమి మీదకు రవాణా చేస్తుంది. అయినప్పటికీ NASA రాకెట్ ఎక్కడ ల్యాండ్ అవుతుందో కచ్చితంగా గుర్తించలేనందున ఇది అనేక సవాళ్లతో ముడిపడి ఉంది. అందుకే శాంపిల్ ఫెచ్ రోవర్(ESA నుంచి రెండో రోవర్)ను ల్యాండర్‌తో పాటు పంపించాలనుకున్నారు. ఒకవేళ ఏదైనా కారణంతో రోవర్ అక్కడి శాంపిల్స్‌ను బదిలీ చేయలేకపోతే, బదులుగా ఫెచ్ రోవర్ ద్వారా వాటిని కలెక్ట్ చేస్తుంది. ఈ కొత్త ప్లాన్ ప్రకారం రాకెట్‌ను మోసుకెళ్లే పేలోడ్‌లో రెండు కొత్త హెలికాప్టర్ డ్రోన్‌లను పంపాలన్నది నాసా ఆలోచన. అంటే ఈ మొత్తం మిషన్‌కు ఒక ల్యాండర్ మాత్రమే అవసరం. ఇక్కడ పర్సెవరెన్స్‌కు కుదరకపోతే రికవరీ హెలికాప్టర్లు నమూనాలను సేకరిస్తాయి. అంటే అవి బ్యాకప్ ఎంపికగా ఉంటాయి.

ఇది కూడా చదవండి: మ్యాథ్స్, సైన్స్ కాన్సెప్ట్‌ల‌తో హైదరాబాదీ కంపెనీ గేమ్స్..

Advertisement

Next Story