- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ అవినీతిని నిరూపించకపోతే నేను ఆత్మాహుతికి రెడీ: నాగం
దిశ, నాగర్‌కర్నూల్: యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని మోసగించి రెండుసార్లు గద్దెనెక్కిన సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే ధనవంతులు అయ్యారని మాజీమంత్రి నాగం జనార్ధన్ రెడ్డి ఫైరయ్యారు. బుధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ ఏడేళ్ల పాలనలో చేసిన అవినీతి, అక్రమాలను పూర్తి ఆధారాలతో సహా నిరూపించి తీరుతానని, లేని పక్షంలో తాను ఆత్మాహుతికైనా సిద్ధమని.. సీఎం కేసీఆర్ దీనికి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ప్రజాస్వామ్యబద్ధంగా నడవాల్సిన శాసనసభ వ్యవహారాల తీరుపై మండిపడ్డారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పాలన ఎక్కడా చూడలేదన్నారు. దేశంలోనే ఇంతటి అవినీతి ముఖ్యమంత్రిని చూడలేదన్నారు. తలసరి ఆదాయం పెరుగుదలతో తెలంగాణ దేశంలో నెంబర్ వన్ అని చెప్పుకుంటున్నారని.. నిజమే కేసీఆర్ కుటుంబం, తన కాంట్రాక్టర్ల తలసరి ఆదాయం పెరుగుదల దేశంలోనే మొదటి స్థానాన్ని సంపాదించారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 83 వేల మంది ఉద్యోగస్తులు లేకుండా రాష్ట్రాన్ని నడిపిన ఘనత దేశంలో మరే ముఖ్యమంత్రికి చెందదని ఎద్దేవా చేశారు. శ్రీశైల జలాశయంలో నీరు లేక ఉమ్మడి పాలమూరు జిల్లాలో పంటలు ఎండుతున్నా సస్యశ్యామలం అయిందని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఎస్ఎల్ బీసీ నిర్మాణం కోసం కాంగ్రెస్ హయాంలో 30 కిలోమీటర్లు టన్నెల్ తవ్వితే కేసీఆర్ ప్రభుత్వం మాత్రం కేవలం ఒక కిలోమీటరు తవ్వినట్లు చెప్పారు. పాలమూరు నిర్మాణం పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదన్నారు. విద్య, వైద్యం, ప్రాజెక్టులు, వ్యవసాయ రంగంలో అనుభవంలేని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి కందనూలు ప్రజలకు పట్టిన దరిద్రమన్నారు.