- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పుట్టగొడుగులు మాట్లాడుకుంటాయట.. కొన్ని పదాలను గుర్తిస్తాయని తేల్చిన పరిశోధన

దిశ, వెబ్‌డెస్క్: పుట్టగొడుగులు (మష్రూమ్స్).. ఎక్కువ మంది వీటిని ఆరోగ్యం అని తమ ఆహారంలోకి తీసుకుంటుంటారు. వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య లాభాలు ఉన్నాయి. అయితే తాజాగా వీటిపై జరిగిన ఓ పరిశోధన పుట్టగొడుగుల గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టింది. పుట్టగొడులు మాట్లాడుకుంటాయని, దాదాపు 50 పదాలను గుర్తిస్తాయని ఈ పరిశోధన తెలుపుతోంది. ఈ పరిశోధనను ఇంగ్లాండ్‌కు చెందిన యూనివర్సిటీ ఆప్ ది వెస్ట్ ఇంగ్లాండ్ ప్రొఫెసర్ ఆండ్రూ అడమట్జ్కీ చేశారు. నాలుగు రకాల శిలీంధ్రాల విద్యుత్ కార్యకలాపాల (ఎలక్ట్రికల్ యాక్టివిటీ) పై ఈ పరిశోధన చేశారు. ఇందులో శిలీంధ్రాల విద్యుత్ కార్యకలాపాలు ఎలా పనిచేస్తాయి, వాటి నిర్మాణం ఎలా ఉంటుందని ఆయన పరిశోధించారు.
అయితే శిలీంధ్ర విద్యుత్ ప్రేరణలు కూడా మానవ ప్రసంగాన్ని పోలీన నిర్మాణంలో ఉంటాయని ఆయన కనుగొన్నారు. అంతేకాకుండా వాటి నిర్మాణం కొన్ని డజన్ల పదాల విద్యుత్ కార్యకలాపాల మాదిరిగానే ఉంటాయని ఆయన తెలిపాడు. అయితే పుట్టగొడులు కూడా మావుల మాదిరిగానే ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయని, మానవ భాషలోని దాదాపు 50 పదాలను అవి గుర్తించగలవని ఆయన పరిశోధన వెల్లడించింది.