వయసు ఒత్తిడి తట్టుకోలేక.. అలా చేయాలనిపించేది : నటి

by Disha Desk |
వయసు ఒత్తిడి తట్టుకోలేక.. అలా చేయాలనిపించేది : నటి
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ తాజా ఇంటర్వ్యూలో తన బాల్యం, సినీ కెరీర్ విశేషాలను పంచుకుంది. చిన్న చిన్న సమస్యలకే భయపడిపోయి చనిపోవాలనుకునేదాన్నని, ఓసారి ఏకంగా ట్రైన్‌లో నుంచి దూకేయాలనిపించిందని వెల్లడించింది. 'ఈ ప్రపంచంలో ఎవరైనా 15-20 ఏళ్ల వయసులో చాలా ఎమోషనల్ ఫీలింగ్స్ కలిగివుంటారు. ఎందుకంటే ఆ స్టేజ్‌లో వాళ్లు ఏం కోరుకుంటారో.. దాని కోసమే నిరంతరం తపన పడుతుంటారు. అదే టైమ్‌లోనే ఎన్నో రకాల సవాళ్లను ఎదుర్కోవడంతో పాటు జీవితంలో సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఒత్తిడికి తట్టుకోలేక సూసైడికల్ థాట్స్ పుట్టుకొస్తుంటాయి. లోకల్ ట్రైన్‌లో స్కూల్‌కు వెళ్తున్నప్పుడు ఒక్కోసారి అందులో నుంచి దూకితే ఎలా ఉంటుందనే ఆలోచనలు వచ్చేవి' అంటూ వివరించింది. ఇక పేరెంట్స్ తనను డెంటిస్ట్ చేసేందుకు కలలు కన్నారని, కానీ అందుకు విరుద్ధంగా మాస్ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ చదివి సినిమా రంగంలోకి వచ్చానంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story