నేడు ఉపరాష్ట్రపతి వీడ్కోలు విందు!

by Harish |
నేడు ఉపరాష్ట్రపతి వీడ్కోలు విందు!
X

న్యూఢిల్లీ: రాజ్యసభ చైర్మన్ గురువారం 72 మంది రాజ్యసభ ఎంపీలకు వీడ్కోలు విందు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని బుధవారం అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో పాటు సాంప్రదాయ వీడ్కోలు ప్రసంగాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి నివాసంలో నిర్వహించనున్నట్లు తెలిపాయి. ఈ కార్యక్రమంలో త్వరలో పదవీ విరమణ చేయనున్న ఎంపీలు కూడా ఉన్నారు. ఇక ఉపరాష్ట్రపతి పదవీకాలం కూడా ముగియనున్న సంగతి తెలిసిందే. కాగా, విందులో పలువురు రాజ్యసభ ఎంపీలు తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శించనున్నారు. వీరిలో ఎంపీలు శాంతాను సేన్, డోలా సేన్ , తిరుచి శివ, రూపా గంగూలీ, వందనా చావన్, రామచంద్ర జాంగ్రాతో పాటు పలువరు ఎంపీలు తమ నైపుణ్యాలను చూపించనున్నట్లు తెలిపారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత పార్లమెంటు సభ్యులు ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు రాజ్యసభ సెక్రటేరియట్ సీనియర్ అధికారులు వెల్లడించారు.

Next Story

Most Viewed