- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇందీరా గాంధీ చేయని ఆ ధైర్యం.. సోనియా గాంధీ చేసింది: ఎంపీ కోమటిరెడ్డి
దిశ, భువనగిరి రూరల్: తనపై నమ్మకంతో స్టార్ క్యాంపెయినర్ పదవి ఇచ్చినందుకు సోనియా గాంధీకి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా.. పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోనే జిల్లాల్లో జ్యోతిరావు ఫూలే విగ్రహాలు పెట్టామని పేర్కొన్నారు. పీసీసీతో పాటు అందరితో కలిసి పనిచేయాలని తనకు పదవి ఇచ్చారని తెలిపారు. ఇందిరా గాంధీ చేయని ధైర్యం.. సోనియా గాంధీ చేసి.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని అన్నారు.
కానీ ప్రత్యేక రాష్ట్రంలో నాలుగు కుటుంబాలే బాగుపడ్డాయని పేర్కొన్నారు. ఒక్క కేసీఆర్ వల్లే తెలంగాణ రాలేదని.. తన లాంటి వాళ్లు ఎంతో మంది పదవి త్యాగం చేస్తే వచ్చిందన్నారు. శ్రీలంక దేశ మాదిరిగానే.. తెలంగాణలో కూడా ఒకే కుటుంబ పాలన చేసి దోచుకుంటుదని.. ఈ దోపిడి నుండి తెలంగాణను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నాలు చేస్తే ముందస్తు అరెస్ట్‌లు చేసే పోలీసులు.. టీఆర్ఎస్ నాయకులు ధర్నాలు చేస్తే మాత్రం పట్టింపు ఉండదా అని ప్రశ్నించారు. ప్రియాంక గాంధీ కొడుకు వైద్యం కోసం హైదరాబాద్‌కు వస్తే.. కేసీఆర్ మాత్రం పంటి నొప్పి అని ఢిల్లీ వెళ్ళారని ఎద్దేవా చేశారు. కేసీఆర్, బీజేపీ రెండు ఒక్కటే అని ఆరోపించారు.