- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్‌కు భారీ స్పందన.. రికార్డు స్థాయిలో చెల్లింపులు
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ట్రాఫిక్ చలాన్లపై ప్రకటించిన రాయితీలకు వాహనదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. వాహనాలపై నమోదైన చలాన్లను క్లియర్ చేసుకునేందుకు వచ్చిన సువర్ణావకాశంగా భావిస్తూ వెంట వెంటనే కట్టేస్తున్నారు. దీంతో ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న చలాన్లు వసూలవుతున్నాయి. పోలీస్ శాఖ ఇచ్చిన రాయితీతో ఇప్పటి వరకు 15 రోజుల్లో 1.30 కోట్ల చలాన్లను వాహనదారులు క్లియర్ చేశారు. వీటి ద్వారా ప్రభుత్వ ఖజానాలో రూ.130 కోట్లు జమ అయ్యాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అయితే, మొదట్లో కొంత సర్వర్ ప్రాబ్లమ్ ఏర్పడినప్పటికీ ఇప్పుడు ఆ సమస్య లేదని తెలిపారు. పోలీసు శాఖ మార్చి 31 వరకు రాయితీతో చలాన్లు చెల్లించేందుకు అవకాశం ఇచ్చిందని, మొత్తం రూ.300 కోట్లు వసూలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు అధికారులు చెప్పారు. అంతేకాకుండా వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ చలాన్లు క్లియర్ చేసుకోవాలని సూచించారు.